Bangladesh T20 World Cup: భారత్ వేదికగా జరిగే 2026 టీ20 ప్రపంచ కప్‌లో తమ జట్టు పాల్గొనట్లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తమ టీమ్‌ను భారత్‌కు పంపట్లేదని వెల్లడించింది. అంతర్గత బోర్డు సమావేశం తర్వాత జనవరి 22న ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బీసీబీ డైరెక్టర్లతో ఐసీసీ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి వైదొలగితే.. ఫిబ్రవరి 7 ప్రారంభ తేదీకి ముందే స్కాట్లాండ్ టీమ్‌ను రీప్లేస్ చేస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. తాము ఐసీసీతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటామని.. తాము ప్రపంచ కప్ ఆడాలనుకుంటున్నామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ అన్నారు. అయితే తాము భారత్‌లో మ్యాచ్‌లు ఆడమని తేల్చేశారు. ఐసీసీ బోర్డు సమావేశంలో కొన్ని షాకింగ్ నిర్ణయాలు వచ్చాయని.. ముస్తాఫిజుర్ మాత్రమే సమస్య కాదన్నారు. ముస్తాఫిజుర్ విషయంలో బీసీసీఐ మాత్రమే నిర్ణయం తీసుకుందని అన్నారు.
"భారత్ నుంచి మా మ్యాచ్‌లను మరో చోటకు మార్చాలనే మా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ స్థితి గురించి మాకు కచ్చితంగా తెలియదు. ఐసీసీ 200 మిలియన్ల మందిని లాక్ చేశారు. క్రికెట్ ఒలింపిక్స్‌కు వెళుతోంది. కానీ మాలాంటి దేశం అక్కడికి వెళ్లకపోతే అది ఐసీసీ వైఫల్యం" అని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంతో స్కాట్లాండ్ టీమ్‌కు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయంపై ఐసీసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్లు గురువారం ఢాకాలో క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్, BCB అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాంతో సమావేశం నిర్వహించారు. టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై చర్చించారు. శ్రీలంకకు తమ మ్యాచ్‌లను తరలించాలనే ప్రతిపాదనను బుధవారం ఐసీసీ తిరస్కరించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ నిర్ణయం తెలిపేందుకు ఒకరోజు గడువు ఇవ్వగా.. ఇవాళ సమావేశమయ్యారు. ఈ భేటీ నూరుల్ హసన్, షమీమ్ హొస్సేన్, హసన్ మహమూద్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, జాకర్ అలీ, సైఫ్ హసన్ తదితర ఆటగాళ్ళు పాల్గొన్నారు.
బంగ్లాదేశ్‌లో హిందూవులను దారుణంగా హతమారుస్తుండడంతో భారత్‌లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్‌లో ఆడించొద్దని అన్ని వైపులా డిమాండ్స్ వచ్చాయి. దీంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ముస్తాఫిజుర్‌ను టీమ్ నుంచి విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఆగ్రహంగా బంగ్లాదేశ్.. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత భద్రతా కారణాలను సాకుగా చూపుతూ.. భారత్‌లో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. ఐసీసీ ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు తప్పుకుంటున్నట్లు బీసీబీ ప్రకటించింది.









