
Yuzvendra Chahal: భార్య ధనుశ్రీతో అధికారికంగా విడాకులు తీసుకున్న తరువాత టీమ్ ఇండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌లో ఓ అందమైన భామతో హుషారుగా కన్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. ఈ అందమైన భామ ఎవరనే చర్చ నడుస్తోంది.
దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయంతో పాటు మరో దృశ్యం చర్చనీయాంశంగా మారింది. భార్య ధనుశ్రీతో విడాకులు తీసుకున్న తరువాత నిన్న ఒక్కసారిగా స్టేడియంలో మెరిశాడు. అది కూడా ఓ అందమైన భామతో కలిసి. అమ్మాయి పక్కన కూర్చుని మ్యాచ్ అసాంతం ఎంజాయ్ చేశాడు. చాహల్ పక్కన ఉన్న అమ్మాయి ఎవరనే చర్చ మొదలైంది. ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీతో డేటింగ్ చేస్తున్నాడంటూ ఊహాగానాలు వస్తున్నాయి. అసలీ అందమైన భామ ఎవరు..ఏమా కధ.
ఈ అమ్మాయి పేరు ఆర్జే మహ్వాష్. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆమె వాయిస్‌కు డిమాండ్ ఉంది. బిగ్‌బాస్, నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్ చేసేందుకు ఆఫర్ కూడా వచ్చిందని తెలుస్తోంది. సెక్షన్ 108 సినిమా ఈమెనే నిర్మించింది. ధనుశ్రీతో విడాకుల తరువాత యుజువేంద్ర చాహల్ ఈమెతో సన్నిహితంగా ఉంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇద్దరి డేటింగ్ గురించి వార్తలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. గత ఏడాది క్రిస్మస్ విందులో కూడా ఇద్దరూ కలిసి కన్పించారు.
ఉత్తరప్రదేశ్ అలీగఢ్ యూనివర్శిటీలో డిగ్రీ చేసిన ఆర్జే మహ్వాష్ ఆ తరువాత ఢిల్లీలోని జామియా మిల్లియా యూనివర్శిటీలో మాస్ కమ్యూనికేషన్ పీజీ చేసింది. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన ఆర్జే మహ్వాష్ భారీగా అభిమానుల్ని సంపాదించుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి