Team India Celebrates 2024 T20I World Cup Win: 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచి జూన్ 29 నాటికి భారత్ ఏడాది పూర్తి చేసుకుంది. బార్బడోస్‌లో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి, 17ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. భారత జట్టు ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు ఈ సందర్భాన్ని కేక్ కట్ చేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విజయ వార్షికోత్సవ వేడుకలో రిషబ్ పంత్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడది నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ వేడుక వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రకారం.. అందులో రెండు కేకులు ఆర్డర్ చేశారు. 1 నిమిషం 10 సెకన్ల వీడియోలో, టీ20 విజేత కెప్టెన్ రోహిత్ శర్మ అక్కడ లేకపోవడంతో మొదట్లో ఏ ఆటగాడు కేక్ కట్ చేయడానికి ముందుకు రాకపోవడాన్ని మనం చూడవచ్చు. అప్పుడు టోర్నమెంట్‌లో అత్యధికంగా 17 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ ముందుకు వచ్చాడు. కానీ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అని గుర్తు చేసిన వెంటనే, బుమ్రా, సిరాజ్ కలిసి కేక్ కట్ చేశారు. దీని తర్వాత ఆటగాళ్లందరూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ సందడి చేశారు. అంతేకాదు బౌలింగ్ కోచ్ టి దిలీప్‌కు తినిపించారు.
Also Read: IAS Salary 2025: మినిస్టర్ శాలరీ కంటే IAS ఆఫీసర్ జీతం ఎక్కువా? ఇతర అలవెన్సెస్ ఎలా ఉంటాయ్?
అయితే ఈ వీడియోలోని ఒక ఫన్నీ సన్నీవేశాం చోటుచేసుకుంది. బుమ్రా, పంత్ జడేజాకు కేక్ తినిపించి హ్యాపీ రిటైర్మెంట్ అని చెప్పారు. దానికి జడేజా నవ్వుతూ తాను ఒకే ఫార్మాట్ కు వీడ్కోలు పలికానంటూ స్పష్టం చేశారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, జడేజా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యారు. రోహిత్ , కోహ్లీ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ నుండి కూడా రిటైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాను ఒకే ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యానని పంత్ చేసిన ప్రకటనకు జడేజా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఈ ముగ్గురితో పాటు భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా టీం ఇండియా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ ఫన్నీ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.
In Birmingham, bringing in one-year anniversary of #TeamIndia's T20 World Cup ? Triumph!
Core memory ? pic.twitter.com/FUUjbKdnHN
— BCCI (@BCCI) June 29, 2025
కాగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్ జూలై 2 నుండి ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత భారత్ 0-1తో వెనుకబడి ఉంది. ప్పుడు రెండో టెస్ట్‌ను గెలవడం ద్వారా సిరీస్‌ను సమం చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే, ఇప్పటివరకు ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన 7 మ్యాచ్‌లలో భారత్ ఒక్కసారి కూడా గెలవలేదు, కాబట్టి టీమ్ ఇండియా దాని కొత్తకెప్టెన్ శుభ్‌మాన్ గిల్ డబుల్ సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









