Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు తిరుగు లేదు..కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ కోచ్..!
Hardik Pandya: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జోరు కొనసాగుతోంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు.ఈనేపథ్యంలో టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.
Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. అతడు నంబర్ వన్ ఆల్‌రౌండర్ అని మరోమారు స్పష్టం చేశాడు. ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా నంబర్ వన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అని అన్నాడు. తాను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారని గుర్తు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అతడిని తిరుగు లేదని తెలిపాడు.
ప్రతి ఒక్కరూ తమదైన అభిప్రాయాలను తెలిపే స్వేచ్ఛ ఉందన్నాడు. ఎవరీ ఇష్టం వారికి ఉంటుందని..ఐతే తన అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉందని తేల్చి చెప్పాడు. ఇటీవల ఆసియా కప్‌లో హార్దిక్ పాండ్యా పర్వాలేదనిపించాడు. తొలి మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించినా..ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో అంతగా రాణించలేకపోయాడు. సూపర్-4లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి 44 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు.
ఈనేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు హార్దిక్ పాండ్యాపై పెదవి విరిచారు. తాజాగా ఆ వ్యాఖ్యలకు రవిశాస్త్రి కౌంటర్ ఇచ్చాడు. ఓ క్రీడా ఛానెల్‌లో ఈమేరకు స్పందించాడు. మొత్తంగా గాయం నుంచి కోలుకున్న తర్వాత టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆట తీరులో మార్పు వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విశేషంగా రాణిస్తున్నాడు. ఆసియా కప్ ముందు జరిగిన ఇంగ్లండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ సిరీస్‌లో అద్బుతంగా ఆడాడు.
ఐతే ఆసియా కప్‌లో మాత్రం అంతగా రాణించలేకపోయాడు. మొదటి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడినా..ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. బౌలింగ్‌లో వికెట్లు తీయలేకపోయాడు. త్వరలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. మెగా టోర్నీకి ఇటీవల భారత జట్టును ప్రకటించారు. ఇందులో ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. ప్రపంచకప్‌లో అతడి ఆట జట్టు విజయంలో కీలకం కానుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతకంటే ముందు టీమిండియా..స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో టీ20 సిరీస్‌ను ఆడనుంది. ఈనెల 20 నుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానుంది.
[[{"fid":"245489","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read:China Accident: చైనాలో మరోసారి రోడ్‌టెర్రర్..27 మంది మృతి, మరో 20 మందికి గాయాలు..!
Also read:Virat Kohli: నయా లుక్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ..ఫోటోలు వైరల్..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి