Team India Schedule: టీమ్ ఇండియా నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి, ఇంగ్లండ్ సిరీస్ తరువాత రెస్ట్ ఉందా లేదా

Team India Schedule: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయంతో టీమ్ ఇండియాపై అంచనాలు పెరిగిపోయాయి. టీమ్ ఇండియా తరువాత ఎక్కడ ఆడుతుంది, ఎవరితో సిరీస్ ఉంటుందనే చర్చ మొదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 11, 2025, 10:43 PM IST
Team India Schedule: టీమ్ ఇండియా నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి, ఇంగ్లండ్ సిరీస్ తరువాత రెస్ట్ ఉందా లేదా

Team India Schedule: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో లీగ్ దశ నుంచి నాకౌట్ వరకూ ఒక్క ఓటమి లేకుండా గెలుస్తూ చివరికి ట్రోఫీ సాధించింది టీమ్ ఇండియా. ప్రపంచవ్యాప్తంగా రోహిత్ సేనపై ప్రశంసలు కురుస్తున్నాయి. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు పుల్ ఫామ్‌లో ఉండటంతో భారత జట్టుపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్న టీమ్ ఇండియా నెక్స్ట్ టార్గెట్ ఏంటి..ఎవరితో, ఎక్కడ, ఎప్పుడు ఆడనుందో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

దుబాయ్ పాకిస్తాన్ వేదికలపై 19 రోజుల పాటు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసింది. ఇండియా విజేతగా నిలిచింది. విజేతగా స్వదేశానికి తిరిగొచ్చిన ఆటగాళ్లకు వివిధ విమానాశ్రయాల్లో భారీగా స్వాగతం లభించింది. ఇప్పుడు టీమ్ ఇండియా నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఏ సిరీస్ ఆడనుంది, ఎప్పుడు ఉంటుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి వచ్చే 4 నెలల పాటు టీమ్ ఇండియా జట్టుగా ఎలాంటి సిరీస్ ఆడటం లేదు. పూర్తిగా విశ్రాంతి మోడ్‌లో ఉంటుంది. కానీ ఎవరికి వారు వ్యక్తిగతంగా మాత్రం మరో రెండు నెలలు పూర్తిగా బిజీ కానున్నారు. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ 18 ప్రారంభం కానుంది. మార్చ్ 22 నుంచి మే 5 వరకు జరగనున్న ఐపీఎల్ 2025లో టీమ్ ఇండియాలోని దాదాపు అందరు ఆటగాళ్లు పది ఫ్రాంచైజీల్లో ఉన్నవాళ్లే. 

అంటే టీమ్ ఇండియా ఆటగాళ్లకు మార్చ్ 22 వరకే విశ్రాంతి తీసుకోడానికి అవకాశం ఉంది. ఆ తరువాత రెండు నెలలు హెక్టిక్ షెడ్యూల్. మే 25న కోల్‌కతాలో జరిగే ఫైనల్‌తో ఐపీఎల్ ముగియనుంది. ఐపీఎల్ మొదటి మ్యాచ్ గత సీజన్ విజేత కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మార్చ్ 22వ తేదీన బెంగళూరులో జరగనుంది. 

ఐపీఎల్ తరువాత ఫుల్ బిజీ

ఐపీఎల్ 2025 మే 25న ముగిసిన తరువాత జూన్ నెల మూడో వారం నుంచి టీమ్ ఇండియా బిజీ కానుంది. టీమ్ ఇండియా ఇంగ్లండ్ పర్యటన ఖరారైంది. ఇండియా - ఇంగ్లండ్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు జరుగుతుంది. అంటే దాదాపు నెలన్నర రోజులు ఇంగ్లండ్‌లో బిజీగా గడపనుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ జూన్ 20 నుంచి 24 వరకు హెడింగ్లీలో  జరగనుంది. రెండవ టెస్ట్ మ్యాచ్ జూలై 2 నుంచి 6 వరు బర్మింగ్ హామ్‌లోని ఎడ్జ్ బాస్టన్‌లో, మూడవ టెస్ట్ జూలై 10 నుంచి 14 వరకు లండన్ లార్డ్స్ మైదానంలో జరగనున్నాయి. ఇక నాలుగవ టెస్ట్ జూలై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్‌లో, చివరి టెస్ట్ మ్యాచ్ జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు లండన్ కెన్నింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. ఇక ఆ తరువాత అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు పూర్తిగా విశ్రాంతిలో ఉంటుంది. ఎలాంటి, ఏ విధమైన సిరీస్ ఉండదు.

Also read: Shubman Gill and Avneet Kaur: సారాకు హ్యాండ్, అవనీత్ కౌర్‌తో శుభమన్ గిల్ డేటింగ్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News