IPL 2026 Mini Auction Players Release: ఐపీఎల్ సందడి కొన్ని నెలల్లో మొదలు కాబోతున్నది. వచ్చే ఏడాది జరగబోతున్న లీగ్‌కు సంబంధించి మినీ వేలం జరగనుండగా.. టీమ్‌లలో కొన్ని మార్పులు చేర్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రతిభ కనబర్చని వారిని.. లేదంటే ఇతర జట్ల ప్లేయర్లను అటు ఇటు మార్చుకునేందుకు మినీ వేలం ఉంటుంది. రిటైన్ చేసుకోవడం.. వేలానికి వదిలేయడం వంటివి మినీ వేలం సందర్భంగా జరుగుతుంటాయి. మరి వచ్చే నెలలో జరగనున్న మినీ వేలానికి సంబంధించి ఇప్పుడే జట్లు కసరత్తు మొదలుపెట్టాయి.
Also Read: Jubilee Hills: జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్.. మళ్లీ బీఆర్‌ఎస్ గెలుస్తుందా? కాంగ్రెస్?
మినీ వేలానికి సంబంధించి జట్టులో ఉన్న వారిని కొందరిని వదులుకునేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉండడంతో ఆయా జట్ల యాజమాన్యాలు తాము రిటైన్ చేసుకునే.. వేలానికి వదిలేసే ఆటగాళ్ల జాబితాను సమర్పించే గడువు సమీపిస్తోంది. నవంబర్ 15వ తేదీలోపు రిటైన్.. వేలానికి వదిలేసే ఆటగాళ్ల లిస్ట్‌ను సమర్పించడానికి నాలుగు రోజుల సమయమే ఉంది.
Also Read: Bihar Exit Polls: బిహార్‌లో మళ్లీ నితీశ్ కుమార్? లేదా తేజస్వి యాదవ్?
బీసీసీఐ విధించిన గడువులోపు ఆయా ఫ్రాంచైజీలు వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు అన్నీ జట్లు రిటైన్ చేసుకునేవారు.. వదిలి పెట్టే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా జట్లపై ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. క్రీడా ప్రపంచంలో చర్చ జరుగుతున్న ప్రకారం అన్నీ జట్లు దాదాపు ఇద్దరు నుంచి నలుగురు వరకు వదిలేసే అవకాశాలు ఉన్నాయి. జరుగుతున్న ప్రచారం ప్రకారం ఫ్రాంచైజీలు వదులుకునే ఆటగాళ్ల పేర్లు ఇలా ఉన్నాయి.
Also Read: Niharika Konidela: హీరోయిన్ నిహారికతో దర్శకుడు రాఘవేంద్ర రావు అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్
సన్‌రైజర్స్ హైదరాబాద్
మూడో ట్రోఫీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న హైదరాబాద్ జట్టు భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. విస్తృతంగా జరుగుతున్న సమాచారం ప్రకారం.. షమి, ఆడమ్ జంపా, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్, రాహుల్ చాహర్‌ను వదులుకునే అవకాశం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్
గత సీజన్‌లో అత్యంత ఫెయిల్యూర్ జట్టుగా నిలిచిన చెన్నై స్వల్ప మార్పులు చేసుకుంటుందని తెలుస్తోంది. అంకుల్స్ టీమ్‌గా ముద్ర పడిన చెన్నై కొందరిని మాత్రమే వదులుకోబోతుంది. విజయ్ శంకర్, డేవాన్ కాన్వే, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠిని వేలానికి వదిలేసే అవకాశాలు ఉన్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న బెంగళూరు తన జట్టులో మార్పులు చేయనుంది. దేవ్‌దత్ పడిక్కల్, రొమారియో షెఫర్డ్, సుయాశ్ శర్మ, రసిఖ్ సలామ్, లియామ్ లివింగ్‌స్టోన్, నువాన్ తుషార తదితరులను వదులుకునేందుకు సిద్ధమైంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్
ఏమాత్రం రాణించని ఆటగాళ్లను కోల్‌కత్తా పక్కనపెట్టనుంది. అంటే వెంకటేశ్ అయ్యర్, మొయిన్ అలీ, క్వింటన్ డికాక్, స్పెన్సర్ జాన్సన్, రమణ్‌దీప్ సింగ్ వంటి ఆటగాళను వేలానికి వదలనుంది.
దిల్లీ క్యాపిటల్స్
మినీ వేలానికి ఢిల్లీ క్యాపిటల్స్ ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, టి నటరాజన్, మోహిత్ శర్మ, ఫాఫ్ డుప్లెసిస్‌ను వదిలే అవకాశం ఉంది.
గుజరాత్ టైటాన్స్
జట్టులో సత్తా చాటని రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, కరీమ్ జనత్, షారుక్ ఖాన్, ఇషాంత్ శర్మ ఆటగాళ్లను వదులుకునేందుకు గుజరాత్ టైటాన్స్ సిద్ధమైంది.
లక్నో సూపర్ జెయింట్స్
మినీ వేలానికి లక్నో సూపర్ జియాంట్స్ షమర్ జోసెఫ్, హిమ్మత్ సింగ్, అబ్దుల్ సమద్, మాథ్యూ బ్రిట్జ్కే, ఆకాశ్ సింగ్ వదిలే అవకాశాలు ఉన్నాయి.
ముంబై ఇండియన్స్
గత సీజన్‌లో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ జట్టును సరిదిద్దుకోనుంది. ఈ క్రమంలోనే దీపక్ చాహర్, రీస్ టాప్లీ, బెవన్ జాకబ్స్, ముజీబుర్ రెహ్మన్ వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పంజాబ్ కింగ్స్
మినీ వేలానికి పంజాబ్ కింగ్స్ భారీగా ప్లేయర్లను వదులుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టాయినిస్, ఫెర్గూసన్‌తోపాటు ఆరోన్ హర్డీ, కైల్ జేమీసన్, బార్ట్‌లెట్, ప్రవీణ్ దూబె, విష్ణు వినోద్, హర్నూర్ సింగ్ మినీ వేలానికి వదిలే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్
వచ్చే సీజన్ కోసం సిద్ధమవుతున్న రాజస్థాన్ రాయల్స్ మినీ వేలానికి ఆకాశ్ మధ్వాల్, ఫజల్ హక్ ఫారూఖీ, నంద్రీ బర్గర్, మహీశ్ తీక్షణ, షిమ్రాన్ హెట్‌మయర్, తుషార్ దేశ్‌పాండే వదిలే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









