
IPL 2025 Final Highlights: ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ఒక్కరోజులో ముగియనుంది. అహ్మదాబాద్ వేదికగా రేపు జరగనున్న ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత ఆసక్తిగా ఫైనల్ పోరు ఉండనుంది. నువ్వేనేనా అని జరగనున్న ఈ టైటిల్ పోరులో ఎవరు గెలవనున్నారనేది ఉత్కంఠ నెలకొంది. ట్రోఫీ కోసం ముంబై, పంజాబ్ చావోరేవో తేల్చుకోనున్నాయి. ఏమాత్రం అంచనా లేని జట్లు ఆఖరి మ్యాచ్ వరకు రావడం విశేషం. మరి ఈ మ్యాచ్‌కు సంబంధించి టాప్ 20 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
తొలి టైటిల్: ఐపీఎల్ 2025 ట్రోఫీ కోసం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ జట్లు ఇప్పటివరకు ఒక్కసారి ట్రోఫీ సాధించకపోవడం గమనార్హం. ఈ లీగ్ ప్రారంభం నుంచి ఉన్న ఈ రెండూ ఫ్రాంచైజీలు టైటిల్‌ను సాధించకపోవడం విశేషం. ఏదో ఒక జట్టు గెలిచి తొలిసారి చాంపియన్‌గా నిలవనుంది.
రెండూ సమానంగా: ఐపీఎల్ 2025లో పంజాబ్, ఆర్సీబీ జట్ల ప్రదర్శన సమానంగా ఉంది. అంటే విజయాలు, అపజయాలు సమానంగా ఉన్నాయి. ఈ రెండూ 14 మ్యాచ్‌లు ఆడి 9 విజయాలు సాధించాయి. 4 ఓటమి పాలవగా.. వర్షం కారణంగా తలా ఒక మ్యాచ్‌ను రద్దు చేసుకున్నాయి. 19 పాయింట్లతో రెండూ జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ అగ్రస్థానంలో.. బెంగళూరు రెండో స్థానంలో ఉంది.
మళ్లీ ఆ రెండు జట్లే: ఆర్సీబీ-పంజాబ్ జట్లు 2021లో అహ్మదాబాద్‌లో ఓ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిచింది. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్‌ను ఆర్సీబీ ఓడించి ఫైనల్‌కు చేరింది. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబయిపై విజయంతో పంజాబ్ ఫైనల్‌కు చేరుకుంది.
వర్షం ముప్పు: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. టైటిల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డేను కేటాయించారు. మంగళవారం వర్షం పడితే తర్వాతి రోజు బుధవారం రిజర్వ్ డే రోజు మ్యాచ్ నిర్వహించనున్నారు.
రిజర్వ్ డే: గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ జరగడానికి సాధ్యమైనంత అవకాశం కల్పించింది. ఒకవేళ వర్షం అడ్డంకితో మ్యాచ్ రాత్రి 9.30 గంటలకు ప్రారంభమైతే ఓవర్లు కుదించకుండానే మ్యాచ్ నిర్వహిస్తారు. ఐదు ఓవర్ల మ్యాచ్‌కు కటాఫ్ సమయం రాత్రి 11.56 గంటలు నిర్ణయించారు. ఆ సమయానికి కూడా మ్యాచ్ జరగకపోతే మ్యాచ్‌కు రిజర్వ్ డేకు వెళ్తుంది.
అర్ధరాత్రి వరకు అవకాశం: ఐపీఎల్ 2025 ఫైనల్లో రిజర్వ్ డే రోజున మ్యాచ్ పూర్తిస్థాయిలో నిర్వహించడం సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ఆడిస్తారు. సూపర్ ఓవర్ అత్యధిక పరుగులు చేసిన జట్టు చాంపియన్‌గా నిలుస్తుంది. ఈ సూపర్ ఓవర్‌కు కూడా అదనంగా 20 నిమిషాల సమయాన్ని అదనంగా కేటాయించారు. అంటే సూపర్ ఓవర్ రాత్రి 12.30 గంటలకు కూడా నిర్వహించేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది. అప్పటికీ వాతావరణం సహకరించకపోతే ఫైనల్ మ్యాచ్ రద్దు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌ను విజేతగా నిలుస్తుంది.
కోహ్లీకి గిఫ్ట్: పంజాబ్ కన్నా బెంగళూరుకు ఈ ట్రోఫీ అత్యంత అవసరం. బెంగళూరు మూడుసార్లు ఫైనల్లోకి వెళ్లి ట్రోఫీని చేజార్చుకుంది. ఆల్ టైమ్ ఫేవరేట్‌గా ఉన్న ఈ జట్టు 'ఈ సాలా కప్ నమ్దే' అంటూ ప్రచారంతో హోరెత్తిస్తోంది. కానీ 18 ఏళ్లుగా ట్రోఫీ దక్కడం లేదు. విరాట్ కోహ్లీ ఉండడంతో బెంగళూరుపై అందరి దృష్టి ఉంది. ఈ కప్ కోహ్లీ కోసమైనా గెలవాలని అతడి అభిమానులు కోరుతున్నారు.
వారి మాటలు నిజమవుతాయా?: ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఆడుతుండడంతో బెంగళూరుపై భారీ ఆశలు ఉన్నాయి. కోహ్లీ ఉన్నంతవరకు బెంగళూరు ట్రోఫీ గెలవదని ప్రత్యర్థులు, విమర్శకులు చేస్తున్న విమర్శలు నిజమవుతాయా? అనేది చూడాలి.
కసితో పంజాబ్: ఐపీఎల్ ఫైనల్లోకి పంజాబ్ కింగ్స్ రెండోసారి అడుగుపెట్టింది. 2014లో కోల్కత్తా నైట్‌రైడర్స్‌పై పోరాడి ఐపీఎల్ ట్రోఫీని చేజార్చుకుంది. 15 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంజాబ్ కింగ్స్ తీవ్ర కసితో ఉంది.
ఐపీఎల్‌కు బైబై: ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే చాలా మంది క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. సీనియర్లుగా ఉన్న విదేశీ ఆటగాళ్లతోపాటు భారత ఆటగాళ్లు ఆ జాబితాలో ఉన్నారు. ఇప్పటికే మాక్స్వెల్, క్లాసెన్ క్రికెట్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook