)
Umpire Hit by Ball Video: ఈసారి ఆసియా కప్‌లో క్రికెట్ కంటే వివాదాలే హైలెట్‌గా నిలుస్తున్నాయి. పాక్ ఆటగాళ్లకు టీమిండియా ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో కాంట్రావర్సీ మొదలైంది. పహల్గామ్ బాధిత కుటుంబాలకు మద్దతుగా ఉంటామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించాడు. తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాకిస్థాన్ ఆటగాళ్లు గుర్రుగా ఉన్నారు. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించేందుకు పట్టబట్టారు. యూఏఈతో మ్యాచ్ ఆడకుండా బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. పీసీబీ బోర్డు పెద్దల సూచనతో గంట ఆలస్యంగా మైదానానికి వచ్చి మ్యాచ్ ఆడారు. ఇలా పాక్ ప్లేయర్స్ తీరు చర్చనీయాంశమైన తరుణంలోనే యూఏఈతో మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. యూఏఈ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాక్ ఆటగాడు విసిరిన బంతి అంపైర్ రుచిర పల్లియగురుగే తలకు బలంగా తాకింది. దీంతో ఆయన గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్‌లో తక్కువ స్కోరు చేసినా.. బౌలింగ్ లో రాణించి పాకిస్థాన్ గట్టెక్కింది. ఈ విజయంతో టాప్-4లోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా షాహిన్ ఆఫ్రిది ఎంపియ్యాడు.
The ball hit the umpire. pic.twitter.com/xhxrjReokI
— الف (@Offcourseasssad) September 17, 2025
ఇక యూఏఈ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఊహించని విధంగా అంపైర్ రుచిర పల్లియగురుగేకి బంతి తగిలింది. పాకిస్థాన్ బౌలర్ సైమ్ అయూబ్ బౌలింగ్ చేస్తున్న టైమ్‌లో వికెట్ కీపర్ బంతిని విసిరాడు. ఆ బంతి నేరుగా బౌలర్ దగ్గర నిలుచున్న అంపైర్ రుచిర పల్లియగురుగే తలకు తాకింది. వెంటనే ఆయన తన చెవిని పట్టుకుని నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి.. ఫస్ట్ ఎయిడ్ చేశారు. తనకు తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందని అంపైర్ చెప్పడంతో వెంటనే గ్రౌండ్ నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఆయన స్థానంలో రిజర్వ్ అంపైర్ గాజీ సోహెల్ అపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
సాధారణంగా ఆటగాళ్లు గాయాలతో మైదానం వీడడం చూస్తుంటాం.. కానీ ఇటీవల గాయం కారణంగా అంపైర్ గ్రౌండ్ నుంచి వెళ్లిపోవడం తొలిసారి. ఇప్పటికే వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న పాక్ ఆటగాళ్లు.. ఈసారి అంపైర్‌ను బాల్ విసిరి బయటకు పంపించారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే పాక్ వికెట్ కీపర్ ఉద్దేశపూర్వకంగా బంతి వేయలేదు. ఇక ఈ మ్యాచ్ లో భారత్ తో పాటు పాకిస్థాన్ కూడా గ్రూప్ ఏ నుంచి సూపర్-4 కు అర్హత సాధించింది. ఒమన్, యూఏఈ ఇంటి ముఖం పట్టాయి. గ్రూప్ బీ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook