Vaibhav Suryavanshi: ఐపీఎల్ తాజా సీజన్ ప్రథమార్థం ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి రేకెత్తించకపోగా.. ద్వితీయార్థం మాత్రం ఊహించని స్పందన లభిస్తోంది. మ్యాచ్‌లు అంతగా ఆసక్తి లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి నిరాశ ఎదురవుతుండగా.. తాజాగా ఐపీఎల్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. వాటిలో వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 14 ఏళ్లకే వైభవ్ శతకం నమోదు చేయగా.. అది కూడా 35 బంతుల్లో వంద బాదడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: RR vs GT: గుజరాత్‌కు భారీ షాక్.. వైభవ్ 'రికార్డు' సెంచరీతో రాజస్థాన్‌కు భారీ విజయం
గుజరాత్ టైటాన్స్ విధించిన 210 పరుగుల లక్ష్యాన్ని వైభవ్ సూర్యవంశీ తుఫాన్ సెంచరీతో 15.5 బంతుల్లోనే మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. గ్రౌండ్‌లోకి దిగిన మొదటి బంతి నుంచే సూర్యవంశీ విరుచుకుపడ్డాడు. బంతిపై ఎంత కోపం పెట్టుకున్నాడో ఏమోనని అతడి బ్యాటింగ్ చూస్తే అర్థమవుతోంది. బంతి రావడం ఆలస్యం సిక్స్ లేదా ఫోర్‌ను బాదేశాడు. గుజరాత్ బౌలర్లను ఊచకోత కోస్తూనే ఫీల్డర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. బౌలింగ్ వేసేది ఎవరనేది చూడడం లేదు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు.
వీర బాదుడుతో 17 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసిన సూర్యవంశీ ఆ తర్వాత మరింత దూకుడు పెంచాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా ఉతికి ఆరేశాడు. కొట్టిన ప్రతి బంతి బౌండరీ లైన్ దాటేసింది. సెంచరీ నమోదు చేసే రోజు సోమవారానికి వైభవ్ సూర్యవంశీ వయసు అక్షరాలా 14 సంవత్సరాల 32 రోజులు మాత్రమే. అంటే సూర్యవంశీ పుట్టినరోజు ముగిసి నెల దాటింది అంతే. లేకపోతే 13 ఏళ్లుగా రికార్డు నమోదయ్యి ఉండేది.
సూర్యవంశీ రికార్డులు
- ఐపీఎల్‌లో అత్యంత వేగంగా శతకం చేసిన భారత ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ తన పేరిట లిఖించుకున్నాడు. 2010 ఐపీఎల్‌లో ముంబైపై రాజస్థాన్ తరఫున యూసుఫ్ పటాన్ 37 బంతుల్లో సెంచరీ చేశాడు.
- అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రిస్ గేల్ (30 బంతుల్లో) తర్వాత సూర్యవంశీ పేరు ఉంటుంది.
- టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సాధించాడు. 14 సంవత్సరాల 32 రోజుల వయసులో సూర్యవంశీ సెంచరీ చేశాడు.
- ఐపీఎల్‌లో అత్యంత వేగంగా అర్థ శకతం, సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









