IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ లో బోణీ కొట్టేందుకు రెడీ అయ్యింది ముంబై ఇండియన్స్ . తొలిపోరులో ఓటమి పాలైన ముంబై విజయమే లక్ష్యంగా శనివారం గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. కీలకమైన ఈ మ్యాచ్ కు ముందు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చిల్ అవుతూ కనిపించారు.
గుజరాత్ లోని జామానగర్ లో బోటు షికారు చేస్తూ ఎంజాయ్ చేసాడు టీమిండియా సారథి. అతనితోపాటు కుర్ర హిట్టర్ తిలక్ వర్మ, ముంబై టీమ్ సహాయక సిబ్బంది ఉన్నారు. వాటర్ స్పోర్ట్స్ లో భాగంగా హిట్ మ్యాన్ బోట్ రైడింగ్ చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్ టోర్నీలో విజయవంతమైన కెప్టెన్ గా పేరుగాంచిన రోహిత్ ముంబైకి ఏకంగా 5 ట్రోఫీలు సాధించి పెట్టాడు. ఓపెనర్ గా, సారథిగా ముంబై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు రోహిత్. గత సీజన్ లో కెప్టెన్సీ నుంచి పక్కకు జరగాడు. అతని స్థానంలో హార్థిక్ పాండ్యాకు పగ్గాలు ఇచ్చారు. అయితే 17వ ఎడిషన్ లో ముంబై పేలవ ప్రదర్శన కనబరిచింది. 18వ సీజన్ ను కూడా ముంబై ఓటమితో ఆరంభించింది.
మార్చి 23న చిదంబరం స్టేడియంలో చెన్నై చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచులో తొలి ఓవర్లోనే డకౌట్ గా వెనుదిరిగిన హిట్ మ్యాన్ గుజరాత్ పై చెలరేగేందుకు రెడీ అవుతున్నారు. మార్చి 29న అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ముంబై, గుజరాత్ లు తలడపడనున్నాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్ పై పోరాడి ఓడిన శుభ్ మన్ గిల్ సేన..తమ సొంత మైదానంలో పాండ్యా బ్రుందానికి చెక్ పెట్టాలని భావిస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య ఇంట్రెస్టింగ్ పోరును ఫ్యాన్స్ మరింత ఎంజాయ్ చేయడం ఖాయం.
Rohit Sharma doing water sports in Jamnagar ?
— Rohan? (@rohann__45) March 26, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









