Virat Kohli's Retirement: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో చేరాడు. వారంలో ప్రారంభం కానున్న ఐపీఎల్ లో విరాట్ బరిలోకి దిగనున్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత స్టార్ ప్లేయర్ విరాట్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని జోరుగా ప్రచారం సాగింది. కానీ అలాంటి షాకింగ్ న్యూస్ లేకపోవడంతో కోహ్లీ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా దీనిపై మరోసారి విరాట్ కోహ్లీ స్పందించారు.
తన క్రికెట్ భవిష్యత్తు ఏంటి. ఎప్పటి వరకు కొనసాగుతాడు. రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తాడనే వాటిపై క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఒలింపిక్స్ లో క్రికెట్ భాగం కావడం, భారత్ లో మహిళా క్రికెట్ డెవలప్ మెంట్ వంటి అంశాలపై కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. తన రిటైర్మెంట్ తర్వాత ప్రణాళికల గురించి మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ, 'నేను ఏమి చేయాలో నాకు తెలియదు, కానీ బహుశా నేను చాలా ప్రయాణం చేస్తాను.' నేను నా సహచరులలో ఒకరిని ఇదే ప్రశ్న అడిగాను. అతని సమాధానం కూడా అలాగే ఉంది. గత సంవత్సరం ఐసిసి టి 20 ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడని, కానీ అతను టెస్టులు, వన్డేల్లో ఆడుతూనే ఉన్నాడు.
Also Read: Gold vs Stock Market: బంగారం వర్సెస్ స్టాక్ మార్కెట్..భవిష్యత్ లో ఎందులో మంచి రాబడి ఇస్తుంది?
ఇటీవల ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ అద్భుతాలు చేశాడు. ఈ టోర్నమెంట్‌లో విరాట్ బలమైన ప్రదర్శన కనబరిచాడు. 5 మ్యాచ్‌ల్లో 54 సగటుతో 218 పరుగులు చేశాడు. ఇందులో పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ చేసిన చారిత్రాత్మక 100 పరుగుల ఇన్నింగ్స్ కూడా ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ సెంచరీతో పాటు 84 పరుగుల ఇన్నింగ్స్ కూడా ఆడాడు.
Virat Kohli said, "I will not come back from retirement to play the Olympics. If we are playing for the Gold Medal, I will come back for one game, get a medal and go back home (smiles)". ?❤️ pic.twitter.com/1jrPuc23z3
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2025
2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ పొట్టి ఫార్మట్ గుడ్ బై చెప్పాడు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ భాగం కావడం పై విరాట్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. క్రికెట్ భాగం కావడం గొప్ప అవకాశంగా పేర్కొన్నాడు. ఒకవేళ టీమిండియా అప్పుడు ఫైనల్ చేరకుంటే ఆ ఒక్క మ్యాచ్ కోసమైనా తాను టీ 20ల్లో తన రిటైర్మెంట్ వెనక్కు తీసుకుంటానేమో అని చెప్పాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter









