close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఈ సార్ట్ క్రికెటర్ ఎవరో గుర్తు పట్టారా ? సరిగ్గా 11 ఏళ్ల క్రితం..

ఈ ఫోటోలో కనిపిస్తున్న సార్ట్ క్రికెటర్ అందరికీ సుపరిచుతుడే... ఇంతకీ అతనెవరో తెసుకోవాలని ఉందా అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే మరి..

Mujeeb Mohammad Mujeeb Mohammad | Updated: Aug 20, 2019, 12:23 AM IST
ఈ సార్ట్ క్రికెటర్ ఎవరో గుర్తు పట్టారా ? సరిగ్గా 11 ఏళ్ల క్రితం..

రన్ మిషన్ గా గుర్తింపు పొందిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 11 ఏళ్ల క్రితం నాటి ఫోటోను చూపుతూ ట్విట్టర్ లో స్పెషల్ పోస్ట్ చేశాడు. ఆగస్టు 18, 2008 భారత జట్టులోకి  ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ ....నిన్నటితో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. అప్పట్లో శ్రీలంకపై మ్యాచ్ తో ఆరంగేట్రం చేసిన కోహ్లీ అంచెలంచెలుగా ఎదుగుతూ వరల్డ్ బెస్ట్ బ్యాట్సెమెన్ గా ఎదిగాడు. తన పదకొండేళ్ల కెరీస్ లో టెస్టులు, వన్డేలు, టీ-20లు కలిపి 68 సెంచరీలు, 95 హాఫ్ సెంచరీలతో మొత్తం 20, 502 పరుగులు చేసి అలుపెరుగుని పోరాట యొధుడిలా కోహ్లీ దూసుకెళ్తున్నాడు. ఇలా తన కెరీర్ లో 11 ఏళ్ల మైలు రాయిని దాటిన సందర్భంగా కోహ్లీ ఈ మేరకు తన ఆరంగేట్రం నాటి ఫోటోను తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

కోహ్లీ మనసులో మాట ఇదే...
పదకొండేళ్ల మైలు రాయిని దాటిన సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ  11 ఏళ్ల  క్రితం టీనేజర్‌ గా సరిగ్గా ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టానని....తన సుదీర్ఘ ప్రయాణం తనను మరింత ప్రతిబింబిచేలా చేసిందని చెప్పుకొచ్చాడు. భగవంతుడు తనను ఇంత గొప్పగా ఆశీర్వదిస్తాడని కలలో కూడా ఊహించలేదు.  కలల్ని సాకారం చేసుకోవడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవాలని యవతకు సందేశమిచ్చిన కోహ్లీ.... అందుకు తగ్గట్టుగా శక్తి సామర్థ్యాలను సొంతం చేసుకోవాలని ట్వీట్టర్ వేదికగా కోరాడు. కాగా కోహ్లీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ ప్లాట్ ఫాంపై తెగ వైరల్ అవుతోంది