Cheteshwar Pujara Century: నెవర్ బిఫోర్.. ఒకే ఓవర్లో 22 పరుగులు బాదిన పుజారా! 73 బంతుల్లోనే సెంచరీ
Cheteshwar Pujara smashes 22 runs in an over. ఛెతేశ్వర్ పుజారా 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఏకంగా 107 పరుగులు చేశాడు.
Cheteshwar Pujara hits century in 73 balls: ఛెతేశ్వర్ పుజారా.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెస్ట్ స్పెషలిస్ట్ అయిన పుజారా బ్యాటింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. క్రీజులో కుదురుకోవడానికి చాలా సమయం తీసుకుంటాడు. 50 బంతులు ఆడి గాని ఒక్క పరుగు చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. బౌలర్లను అంతలా విసిగిస్తుంటాడు పుజారా. ఒక్కో సందర్భంలో పుజారాకు బంతులు వేసి వేసి బౌలర్లు అలసిపోతారు. అలాంటి పుజారా తాజాగా మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. నెవర్ బిఫోర్ అనేలా 73 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ఇంగ్లండ్ గడ్డపై ప్రస్తుతం రాయల్ లండన్ వన్డే కప్ జరుగుతోంది. టీమిండియా టెస్ట్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా సస్సెక్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. శుక్రవారం వార్విక్‌షైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పుజారా మునుపెన్నడూ లేని విధంగా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ససెక్స్ తరఫున తన వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఏకంగా 107 పరుగులు చేశాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. పుజారా ఒకే ఓవర్లో 22 పరుగులు బాదడం.
వార్విక్‌షైర్ నిర్ధేశించిన 311 పరుగుల లక్ష్య ఛేదనలో సస్సెక్స్ 112 పరుగులకు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఛెతేశ్వర్ పుజారా 22వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి పుజారా ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ససెక్స్‌కు చివరి 36 బంతుల్లో 70 పరుగులు అవసరం అయ్యాయి. యామ్ నార్వెల్ వేసిన 45వ ఓవర్‌లో పుజారా చెలరేగిపోయి 22 పరుగులు రాబట్టాడు. వరుసగా 4, 2, 4, 2, 6, 4 బాదాడు. దీంతో పుజారా వ్యక్తిగత స్కోర్ 88 పరుగులకు చేరుకుంది. 48వ ఓవర్‌లో సెంచరీ బాదాడు.
49వ ఓవర్లో 107 పరుగుల వద్ద ఛెతేశ్వర్ పుజారా క్లీన్ బౌల్డ్ అవ్వడంతో అతడి మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. పుజారా అనంతరం మిగతా బ్యాటర్లు విఫలమవడంతో సస్సెక్స్ నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన పుజారాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 'పుజారా.. నెవర్ బిఫోర్ ఇన్నింగ్స్', 'ఇక నీకు ఐపీఎల్ టోర్నీలో చోటు పక్కా' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సస్సెక్స్ రెగ్యులర్ కెప్టెన్ టామ్ హైన్స్ గాయం కారణంగా దూరమవ్వడంతో ఈ మ్యాచ్‌లో పుజారానే కెప్టెన్సీ చేశాడు.
Also Read: Liger Moive Song: కొనిస్తనే కోకా కోకా.. లైగర్ నుంచి మూడో సాంగ్ వచ్చేసింది!
Also Read: Anant Chaturdashi 2022: అనంత చతుర్దశి ఎప్పుడు? దీని విశిష్టత ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook