Mamata Banerjee: కోల్ కతా‌లో హైటెన్షన్.. లియోనల్ మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ..

Mamata Banerjee apology to Lionel messi: కోల్ కతాలో స్టేడియం అంతా అభిమానులు వాటర్ బాటిళ్లు విసిరేసి, చైర్లు విరగ్గొట్టి నానా బీభత్సం చేశారు. మరోవైపు కోల్ కతా మెస్సీ ఈవెంట్ ఆర్గనైజర్ లు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కోల్ కతాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 13, 2025, 03:54 PM IST
  • మెస్సీ పర్యటన వేళ కోల్ కతాలో ఉద్రిక్తత..
  • సారీ చెప్పిన మమతా బెనర్జీ..
Mamata Banerjee: కోల్ కతా‌లో హైటెన్షన్.. లియోనల్ మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ..

West Bengal cm mamata Banerjee public apology to Lionel messi: లియోనల్ మెస్సీ భారత్ కు వచ్చాడు. ఆయన తొలుత కోల్ కతాకు ఈరోజు తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. మరోవైపు మెస్సీని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మెస్సీతో కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దీని కోసం ఎంట్రీ ఫీజులుగా వేలాది రూపాయలు దండుకున్నారు. కనీసం తమ అభిమాన ఫుట్ బాల్ దిగ్గజంను దగ్గర నుంచి చూడొచ్చని చాలా మంది వేలాది రూపాయలు ఉన్న ఎంట్రీపాస్ లను కూడా తీసుకుని స్టేడియంకు వెళ్లారు. అయితే..  మెస్సీచుట్టు రాజకీయ నాయకులు, వీఐపీలు మాత్రమే ఆయన్ను చుట్టుముట్టారు.

Add Zee News as a Preferred Source

 దీంతో సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర గందర గోళం ఏర్పడింది. మొత్తంగా ఆయన పదినిముషాలకే ఆయన వెనుతిరిగారు. ఇక అభిమానులు ఆవేశంలో ఊగిపోయారు. కోల్ కతా స్టేడియంలో కనీసం పది నిముషాలు లేరని, వేలాది రూపాయల ఎంట్రీ పాస్ లు తాము తీసుకున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ బాటిళ్లను, కుర్చీలను విసిరికొట్టారు. స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు. దీనిపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రియాక్ట్ అయ్యారు. లియోనల్ మెస్సీకి, క్రీడాభిమానులకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలియజేశారు.

మెస్సీ పర్యటన సందర్భంగా సాల్ట్‌లేక్ స్టేడియంలో తలెత్తిన నిర్వహణ లోపాన్ని చూసి దిగ్భ్రాంతికి లొనైనట్లు చెప్పారు. మెస్సీ కార్యక్రమంలో పాల్గొనడానికి తొలుత ..స్టేడియానికి బయలుదేరానని అయితే, అక్కడి పరిస్థితిని చూసి తాను వెనుదిరిగానని మమతా చెప్పారు. ఈ ఘటనపై జస్టిస్ అషిమ్ కుమార్ అధ్యక్షతన విచారణ కమిటీని దర్యాప్తుకు ఆదేశిస్తామన్నారు.

ఇప్పటికే ఈ ఘటనలో కోల్ కతా లియోనెల్ మెస్సీ GOAT ఇండియా టూర్ నిర్వాహకుడు సతాద్రు దత్తాను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. ఈవెంట్ కు సంబంధించి అభిమానుల నుంచి తీసుకున్న డబ్బుల్ని తిరిగి చెల్లించేలా ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.

Read more: Lionel Messi fan Video: ఇదెక్కడి మాస్ రా మావా.. లియోనల్ మెస్సీ కోసం ఏకంగా హనీమూన్ వాయిదా వేసుకున్న కొత్త జంట.. వీడియో ..

మరోవైపు సతాద్రు కూడా తాను తిరిగి ఫ్యాన్స్ కు టికెట్ డబ్బులు రిటర్న్ చేస్తానని లిఖిత పూర్వకంగా పోలీసులకు లేఖను రాసిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా లియోనల్ మెస్సీ కోల్ కతా పర్యటన మాత్రం ఒకింత హైటెన్షన్ వాతావరణం ఏర్పడేలా చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News