Who Is RJ Mahavash: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఎట్టకేలకు భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీం ఇండియాతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అంబరాన్నంటిన సంబరాలు చేసుకున్నారు. రోహిత్ శర్మ ఆధిపత్యంలో టాస్ 15వ సారి ఓడిపోయి మరో ఘనత సాధించింది. అంతేకాదు. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్ ట్రోఫీ దక్కించుకొని అరుదైన విజయం సాధించింది.
ఇదిలా ఉండగా దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు క్రికెటర్ల ఫ్యామిలీ కూడా వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో మరో ప్రత్యేకత ఏంటంటే క్రికెటర్ యజువేంద్ర ఛాహల్‌తోపాటు ఆర్జే మహవాష్‌తో కనిపించారు. నిజానికి ఛాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో త్వరలో విడాకులు తీసుకుంటున్నారు అనే ర్యూమర్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ జంటగా కనిపించడంతో అందరి కళ్లు ఈ జంటపై పడ్డాయి. ఇంతకీ ఆర్‌జే మహవాష్ ఎవరు?
RJ మహవష్ ఎవరు?
ఆర్జె మహవాష్ ఆలిఘర్‌లో జన్మించారు. ఈమె ప్రత్యేక కంటెంట్ క్రియేటర్. అంతేకాదు సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు, ఫన్నీ క్లిప్స్ కూడా చేస్తారు. యూట్యూబ్లో తనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మహవాష్ ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత న్యూఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ జామియా మిలియా ఇస్లామియా పూర్తి చేసింది.
ఆ తర్వాత కెరీర్ పరంగా మొదటగా మహవాష్ రేడియో జాకీగా పనిచేసింది. ఆ తర్వాత బాలీవుడ్ 'బిగ్ బాస్ 14' లో కూడా ఆఫర్ వచ్చిందట. అయితే తాను రిజెక్ట్ చేసింది. కేవలంసోషల్ మీడియాకే ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న మహవాష్ కొన్ని బాలీవుడ్ ఆఫర్లను సైతం రిజెక్ట్ చేసిందంటారు.
Ye kya ho raha hai Chahal bhai Paisa zyada aa gya hai kya ?#INDvsNZ #NZvsIND #ChampionsTrophy #yuzvendrachahal pic.twitter.com/HvQLw8u7PE
— ?QAZI? (@koini007) March 9, 2025
అయితే డిసెంబర్లో ఓ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తను యజువేంద్ర ఛాహాలతో డేటింగ్ లో ఉందని రూమర్స్ బయటకు వచ్చాయి. కానీ మహవాష్ దాన్ని కొట్టి పారేసింది, ఫేక్ న్యూస్ ని ప్రచారం చేయొద్దు, ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ పోస్ట్ చేసింది. దీనిపై చాహల్ కూడా ఇలాంటి అసత్య ప్రచారాలతో కుటుంబాలపై ప్రభావం పడుతుందని ప్రచారం చేయొద్దని కోరారు.
ఇదీ చదవండి: ఈరోజు రాశిఫలాలు.. సోమవారం ఈ రాశికి కలిసి వస్తుంది, వీళ్లు కొత్తపనులు మానుకోవాలి..
అయితే ఈ క్రికెటర్ మహవాష్‌తో మొదటిసారి ఇలా బహిరంగంగా కనిపించలేదు. గతంలో కూడా ఈ ఆర్జే ఆయన కనిపించడం చూశాం. క్రిస్మస్ వేడుకలు కూడా మహవాష్‌తోపాటు జరుపుకున్నారు ఆ ఫోటోలు నెట్టింటా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చాహల్ ధనశ్రీ వర్మాలు విడాకులు తీసుకుంటున్నారానే రూమర్స్ కి మరింత ఆజ్యం పోశాయి.తాజాగా వీరిద్దరూ దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో కలిసి కనిపించడంతో అందరూ మళ్లీ వీరు డేటింగ్ లో ఉన్నారని ప్రచారం నిజమేనని అనుకుంటున్నారు.
ఇదీ చదవండి: మృత్యుంజయుడురా మావ.. రైలు ఢీకొట్టినా లేచి నడిచివెళ్లాడు, షాకింగ్ సీసీటీవీ ఫూటేజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్- https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









