)
Women’s World Cup Final 2025: మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ పోరు ఆదివారం జరగబోతుంది. ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. ఈ అద్భుతమైన పోరుకు నవంబర్ 2న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలిసారి ఇరు జట్లు టైటిల్‌ను ముద్దాడాలని భావిస్తున్నాయి. భారత్ మూడోసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకోగా.. దక్షిణాఫ్రికా తొలిసారి ఆడబోతుంది. గతంలో టీమిండియా 2005, 2017లో ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ టైటిల్‌ను గెలుచుకోలేకపోయింది. ఇక ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌ను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చని క్రికెట్ ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఎందులో ఫ్రీగా చూడవచ్చో తెలుసుకుందాం.
ఫ్రీగా DD స్పోర్ట్స్‌లో..
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ వేయడానికి అరగంట ముందు.. మధ్యాహ్నం 2:30 గంటలకు.. రెండు జట్ల కెప్టెన్లు గ్రౌండ్లోకి వస్తారు. భారత్‌లో ఫైనల్ మ్యాచ్ వివిధ స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో లైవ్ ఉంటుంది. క్రికెట్ ఫ్యాన్స్ DD స్పోర్ట్స్‌లో ఈ ఫైనల్ మ్యాచ్‌ను ఫ్రీగా చూడొచ్చు.
ఫ్రీగా జియో హాట్‌స్టార్‌లో..
అంతేకాకుండా క్రికెట్ అభిమానులు తమ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో కూడా జియో హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్ ద్వారా భారత్-దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ లైవ్ స్ట్రీమింగ్‌ను ఫ్రీగా చూడవచ్చు. దీని కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయనవసరం లేదు.
టీమిండియా లీగ్ దశలో మూడు మ్యాచుల్లో గెలిచి, మూడు మ్యాచుల్లో ఓడిపోయి సెమీస్ చేరింది. సెమీపైనల్లో బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఆసీస్ విధించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని అద్భుతంగా ఛేదించి చరిత్ర సృష్టించింది. జెమిమా రోడ్రిగ్స్ జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది. మరోవైపు దక్షిణాఫ్రికా 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి పైనల్‌కు చేరింది.
ఫైనల్లో ఆడే ఇరు జట్లు ఇవే..
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఉమా చెత్రీ, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, రాధా యాదవ్, అమంజోత్ కౌర్, అరుంధతీ రెడ్డి, క్రాంతి రెడ్డి.
దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అయాబొంగా ఖాకా, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, మారిజానే కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జాఫ్తా, నోన్కులులెకో మ్లాబా, అన్నరీ డెర్క్సెన్, అన్నెకే బోష్, మసబాటా క్లాస్, సునే లూస్, కరాబో మెసో, నో స్సెగౌక్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook