close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

రక్తం కారుతున్నా పట్టువీడని విక్రమార్కుడిలా అలెక్స్ కేరీ ప్రదర్శన ...!!

ఇంగ్లండ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ 2 మ్యాచ్ లో తక్కువ స్కోరుకే కీలక వికెట్లు కోల్పోయి ఆసీస్ ఎదురీదుతోంది

Updated: Jul 11, 2019, 05:35 PM IST
రక్తం కారుతున్నా పట్టువీడని విక్రమార్కుడిలా అలెక్స్ కేరీ ప్రదర్శన ...!!

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ సెమీస్ -2 లో ఇంగ్లండ్ -ఆసీస్ తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కు మీకల్లోతు కష్టాల్లో పడింది. 30 ఓవర్లకు కీలకైన 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేసి ఎదురీదుతోంది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ డకౌట్ కాగా మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 9 పరుగులకే ఔట్ అయ్యాడు. మరో బ్యాట్స్ మెన్ పీటర్ హ్యాండ్స్ కబ్ 4 పరుగులకే చేతులెత్తేశాడు. దీంతో ఇన్నింగ్ ను చక్కదిద్దే బాధ్యత స్టిఫెన్ స్మిత్ , అలెక్స్ కేరీ పై పడింది. 

ఈ క్రమంలో స్టిఫెన్ స్మిత్ , అలెక్స్ కేరీ నిలకడగా నిలకడాగా ఆడుతున్న క్రమంలో ఇంగ్లాండ్ పేసర్ ఆర్చర్ విసిరిన ఓ బంతికి ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరీ గాయపడ్డాడు. పిచ్ పై పడిన వెంటనే ఉవ్వెత్తున ఎగసిన ఆ బంతి నేరుగా కేరీ గడ్డానికి తగిలింది. వాయువేగంతో దూసుకొచ్చిన బంతి ధాటికి కేరీ హెల్మెట్ కూడా ఊడిపోయింది. అయితే ఆ గాయానికి డ్రెస్సింగ్ చేయించుకున్న ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఇలా పోరాడుతూ తన వ్యక్తిగత 46 పరుగుల వద్ద నాల్గో వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు. 

గాయంతో రక్తం కారుతున్నా పట్టువీడని విక్రమార్కుడిలా అలెక్స్ కేరీ ఆట అందరినీ ఆకట్టుకుంది. అప్పట్లో అనిల్ కుంబ్లే వెస్టిండీస్ తో టెస్టు మ్యాచ్ లో తలకు కట్టుతో ఇలాగే ఆడి పోరాటపటిమను చాటిన సంఘటన కేరీ గాయంతో మళ్లీ అందరూ జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా స్టిఫెన్ స్మిత్ 60 పరుగులతో క్రీజులో పాతుకుపోయి టాయిలెండర్లతో కలిసి ఆసీస్ కు గౌరవ ప్రదమైన స్కోర్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు.