)
Women Cricket World Cup Trophy Prize Money:మహిళ క్రికెట్ లో విశ్వ విజేతగా నిలిచిన క్రికెట్ టీమ్ కు రూ. 51 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వబోతోంది. ఇంతటి మొత్తాన్ని పురుషుల జట్లకు కూడా ఇప్పటివరకూ బీసీసీఐ ఇవ్వలేదు. అటు, గత ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి ఐసీసీ కూడా ప్రైజ్ మనీనీ దాదాపు మూడు రెట్లు పెంచింది. దీంతో మన మహిళా క్రికెటర్లు పండుగ చేసుకోబోతున్నారు. ఇదే కాదు, భారత మహిళల విజయానికి ఇంకా ఎన్నో సంస్థలు భారీగా క్యాష్ రివార్డులు అందించేందుకు ముందుకు వస్తున్నాయి.
ఈ టోర్నీలో విజేత, రన్నరప్, ఇతర జట్ల కోసం మొత్తంగా ఐసీసీ 13.88 మిలియన్ డాలర్లు (రూ.123 కోట్లు) ప్రైజ్ మనీ పూల్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు, వరల్డ్ కప్ టోర్నీతో పోలిస్తే ఇది 297 శాతం ఎక్కువ. ఇక విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ కూడా గతంతో పోలిస్తే 239 శాతం మేర పెరిగింది. 2023 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన పురుష జట్టుకు ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే ఇది అధికం.
ఇక ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. శఫాలీ వర్మ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు తొలి వరల్డ్‌కప్ టైటిల్ అందించింది. నాకౌట్ దశకు ముందు జట్టులోకి చివరి వేళ చేర్చబడిన శఫాలీ, ఫైనల్లో 87 పరుగులు సాధించి, తర్వాత కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది. ఆమెతో పాటు దీప్తి శర్మ కూడా అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చింది.ఫలితంగా భారత్ దీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న తొలి ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది. లారా వోల్వార్డ్ శతకంతో పోరాడిన దక్షిణాఫ్రికా మరోసారి రన్నరప్‌గా ముగిసింది.
భారత్ తొలి బ్యాటింగ్‌లో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. శతకం లేకుండా జట్టు సాధించిన మూడవ అతిపెద్ద స్కోరు ఇది. ఓపెనర్ స్మృతి మంధాన హిస్టరీ క్రియేట్ చేసింది. ఫైనల్లో చేసిన 45 పరుగులతో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ఈ సీజన్లో 434 పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్ పేరిట ఉండేది. 2017 ఎడిషన్‌లో మిథాలీ 409 పరుగులు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.