WTC Points Table Updates: వైజాగ్‌లో ఇంగ్లండ్‌ను మడతెట్టేసిన టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. ఉప్పల్ లో ఓటమితో రెండు నుంచి ఐదో స్థానానికి పడిపోయిన టీమిండియా.. తాజా విజయంతో మళ్లీ సెకండ్ ఫ్లేస్ కు చేరుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​ఎడిషన్ లో 6 మ్యాచ్‌లు ఆడిన భారత్ 3 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో భారత్ 38 పాయింట్లు సాధించి 52.77 విజయ శాతంతో రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఆ జట్టు 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 3 ఓటములతో 66 పాయింట్లతో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు మ్యాచ్‌ల్లో 1 విజయం, 1 ఓటమితో 12 పాయింట్లు సాధించిన దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. అన్నే పాయింట్లు సాధించిన  సాధించింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లు వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఆరు, ఏడు స్థానాల్లో పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు ఉండగా.. వైజాగ్ టెస్టులో ఓటమితో ఇంగ్లండ్ జట్టు ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లీష్ జట్టు ఇప్పటి వరకు 7 టెస్టు మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు, 3 ఓటములతో 21 పాయింట్లు సాధించింది.


హైదరాబాద్ టెస్టులో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ ను చావు దెబ్బ కొట్టింది. ఇంగ్లీష్ జట్టుపై 106 పరుగుల తేడాతో గెలుపొందింది. టీమిండియా నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనను ప్రారంభించిన స్టోక్స్ సేన.. రెండో ఇన్నింగ్స్ లో 292 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో జాక్‌ క్రాలే (73) హాఫ్ సెంచరీ చేశాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 9 వికెట్లు తీసిన బుమ్రాకే ‘'ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’' అవార్డు దక్కింది. మూడో టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది. 


Also Read: Ravichandran Ashwin: వైజాగ్ టెస్టులో టీమిండియా ఘ‌న విజ‌యం.. రేర్ ఫీట్ సాధించిన అశ్విన్..


Also Read: Ind Vs Eng 2nd Test: ఇంగ్లాండ్‌ను మడతబెట్టేసిన భారత్.. చెలరేగిన బౌలర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter