
Chahal Marriage Controversy: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్‌తో విడాకుల తరువాత కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ దుబాయ్‌కు మకాం మార్చేసింది. చిన్నప్పటి నుంచి ఎక్కువగా దుబాయ్‌లోనే గడిపిన ధనశ్రీ.. ఇటీవల నగరాన్ని తిరిగి సందర్శించింది. దుబాయ్‌లో విహరిస్తూ.. అక్కడ తీసుకున్న పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ జీవితాంతం అనిపించిన ఆ తరువాత మళ్లీ దుబాయ్‌కి తిరిగి వచ్చాను. నేను ఇక్కడే పెరగడంతో నాకు చాలా ముఖ్యమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ నగరం ఎంతగా అభివృద్ధి చెందిందో చూడటం నా హృదయాన్ని కదిలించింది. ఈ అందమైన హిందూ ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉంది. శాంతియుతంగా, శక్తివంతంగా, సంస్కృతి, సమాజాన్ని స్వీకరించడంలో ఈ నగరం ఎంత దూరం వచ్చిందో గుర్తుచేస్తుంది. వృద్ధి, మూలాలు, పునఃసంయోగానికి కృతజ్ఞతలు.." అంటూ ఆమె రాసుకొచ్చారు. దుబాయ్ వాస్తుశిల్పపరంగానే కాకుండా.. విభిన్న సంస్కృతులు, మత సామరస్యాన్ని స్వీకరించడంలో కూడా ఎలా మారిపోయిందో ఆమె వివరించింది.
యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు. ఏడాదిన్నరపాటు కలిసి ఉన్న ఈ జంట.. ఆ తరువాత విభేదాలు రావడంతో దూరంగా ఉన్నారు. జూన్ 2022 నుంచి ఇద్దరు విడిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాంద్రాలోని ముంబై ఫ్యామిలీ కోర్టులో వీరికి విడాకులు మంజూరు చేసింది. ధనశ్రీ వర్మకు చాహల్ 4 కోట్ల రూపాయల కంటే ఎక్కువ భరణం ఇచ్చారని ప్రచారం జరిగింది. చివరి రోజు విడాకుల విచారణ సందర్భంగా చాహల్ "బి యువర్ ఓన్ షుగర్ డాడీ" అని రాసి ఉన్న టీషర్ట్ ధరించి రావడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ధనశ్రీ వర్మను సోషల్ మీడియాలో 'షుగర్ డాడీ' అంటూ నెటిజన్లు, చాహల్ అభిమానులు విమర్శిస్తున్నారు.
తాజాగా రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో చాహల్ కామెంట్స్ చేసిన కాసేపటికే.. ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్‌ను షేర్ చేసింది. వివాదం సృష్టించే ఉద్దేశం తనకు లేదని చెప్పిన చాహల్.. ఇన్‌డైరెక్ట్‌గా ధనశ్రీ వైపు జరిగిన తప్పు కారణంగానే విడాకులు తీసుకున్నట్లు చెప్పాడు. మొదట్లో తాను స్పందించకూడదని అని అనుకున్నానని.. ఇప్పుడు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా వదిలేయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. తాను ఎవరినీ అవమానించలేదని.. సందేశాన్ని మాత్రమే తెలియజేయాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. చాహల్ ఈ కామెంట్స్ చేసిన తరువాత ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశాంతమైన, ఆధ్యాత్మిక పోస్ట్‌ను షేర్ చేసింది. చాహల్ ఎలాంటి కామెంట్స్ చేసినా.. తాను ప్రశాంతంగా ఉంటానని ఆమె ఇన్‌డైరెక్ట్‌గా రిప్లై ఇచ్చిందంటూ నెటిజన్లు అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.