Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున తన నివాసంలో అందెశ్రీ అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు. అయితే నిన్న అందెశ్రీ చివరిసారిగా అయ్యప్ప పూజలో పాల్గొన్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Ande Sri: తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి, ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. గత రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ కలం నుంచి జాలువారిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. తన పాటలు, రచనలతో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. జయ జయహే తెలంగాణ గీతం వచ్చిన ప్రతిసారి అందెశ్రీ ఎంతో భావోద్వేగానికి గురవుతారు.
Ande Sri Last Rites: అందెశ్రీ ఆకస్మిక మృతితో తెలంగాణ సమాజం శోక సంద్రంలో మునిగిపోయింది. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించే స్థాయికి ఎదిగిన ఈయన మరణంతో ఓ శకం ముగిసింది. ఈయన మృతిపై సీఎం రేవంత్ సహా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Ande Sri : ప్రముఖ కవి అందెశ్రీ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, సహా పలువురు రాజకీయ, పలు రంగాల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.
Ande Sri Passed Away: తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' సృష్టికర్త ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నేడు అనగా నవంబరు 10న హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.