Orange Alert to Telangana: తెలంగాణలో ఈ రోజు రేపు పలు జిల్లాల్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎండలతో మలమల మాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Monsoon Effects on Telugu States: ఈ సారి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలను ఎండలు మంటెక్కించాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్య మధ్యలో ఎడారిలో ఒయాస్సిలా క్యూములో నింబస్ మేఘాల కారణంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సకాలంలో రావాల్సిన ఋతుపవనాలు ఈ సారి ఎల్నినో ప్రభావంతో మరింత ఆలస్యం కానున్నాయి.
Telangana IMD: గత రెండు మూడు నెలలుగా ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అవును తెలంగాణలో ఋతు పవనాల ఆగమనానికి లైన్ క్లియర్ అయింది. ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకాల్సిన ఋతు పవనాలు ఈ నెల 31న తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Farmers Crop Loss: తెలంగాణలో గత కొన్ని రోజులుగా దంచి కొడుతున్న ఎండలకు కాస్త బ్రేక్ ఇచ్చాయి వర్షాలు. దీంతో ఎండలతో సతమతమైన ప్రజలకు కాస్త తెరపి పడ్డా.. ఈ అకాల వర్షాలు రైతులను నట్టేటా ముంచాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షంతో తడిసిముద్దయింది. దీంతో తెలంగాణ రైతులు అరిగోస పడుతున్నారు.
Telangana Rains: తీవ్రమైన ఎండలతో అల్లాడిన తెలంగాణ ప్రజలపై వరుణుడు చల్లని చూపు చూసాడు. నిన్న రాత్రి కురిసిన వర్షంతో తెలంగాణలో వాతావరణం మారింది. ఎండలతో అల్లాడిన ప్రజలు చినుకులు పడుతుండడంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. పలు జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో తెలంగాణ ఎండల నుంచి కాస్త తెరిపి పడింది.
Heat Waves: తెలంగాణలో చిత్ర విచిత్రమైన వాతావరణం నెలకొంది. పగలు మాడు పగిలే ఎండలతో అల్లాడిన ప్రజలకు .. రాత్రి వేళ వర్షాలతో కాస్త తెరపి పడ్డట్టు అయింది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గత రికార్డులన్నింటిని తిరగరాస్తుంది. నిన్న సాయంత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలతో ఉదయం కాస్త చల్లబడింది.
Weather Update: ఈ సారి నైరుతి ఋతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. వచ్చే నెల 8న మృగశిర కార్తె ప్రవేశంతో ఎండాకాలానికి ఎండ్ కార్డ్ పడుతుంది. కానీ ఈ సారి మాత్రం మరో రెండు వారాల పాటు ఎండలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ పెద్ద బాంబ్ పేల్చింది.
Severe Heat Wave Alert : ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పూట జనం బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Telangana Heat Waves: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండకు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ లో గత కొన్నేళ్ల రికార్డులను బద్దలు కొట్టిన ఉష్ణోగ్రతలు మే నెలలో రికార్డు స్థాయిలో నమోదు కానున్నాయని వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది.