Mega DSC Final List: మెగా డీఎస్సీ 2025 ఫైనల్ లిస్టును ఏపీ సర్కార్ సోమవారం విడుదల చేసింది. 16,347 పోస్టులకు గాను రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. మెగా డీఎస్సీ పరీక్షల తర్వాత జులై 5న ప్రాథమిక కీని విడుదల చేసింది. ఆగస్టు 1న ఫైనల్ కీని రిలీజ్ చేసింది. మొత్తం ప్రక్రియ తర్వాత తుది జాబితాను నేడు విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో https://apdsc.apcfss.in/ ఫైనల్ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ లింక్ ద్వారా డైరెక్టుగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
AP Teachers Recruitment: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అప్ డేట్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. డీఎస్సీ 2025 ఉపాధ్యాయ ఉద్యోగాలకు తుదిగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలు ఖరారు చేసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నోటిఫై చేసిన మొత్తం 1074 పోస్టులకు మెరిట్ కం రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా జిల్లాలకు సంబంధించి తుది ఎంపికలను రాష్ట్ర స్థాయిలోనే పూర్తి చేసి జాబితాను డీఈవోలకు పంపించింది.