దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ (Coronavirus Vaccine) డ్రైవ్ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.
ప్రజల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ (Corona vaccine)పై నమ్మకం పెంచేందుకు తొలి టీకాను తానే తీసుకుంటానని తెలంగాణ (Telangana) వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కొత్తరకం కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని, బర్డ్‌ఫ్లూ వల్ల కూడా ఎలాంటి నష్టం లేదని ఈటల స్పష్టంచేశారు.
శవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం కొనసాగుతోంది. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి అరికట్టేందుకు వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం దేశమంతటా కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
భారత్‌లో కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ కరోనావైరస్ (COVID-19 Vaccine) వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) స్పందించారు.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ శనివారం ప్రారంభమైంది. ఇంకా కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ (Coronavirus Vaccine) పై రాజకీయాలు ప్రారంభమయ్యాయి.
Coronavirus:కరోనావైరస్ ఏడాది కాలం నుంచి ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ వైరస్ వల్ల ప్రభావితం అయ్యారు. తమకు వ్యాక్సిన్ ఎప్పుడు లభిస్తుందా అని అని భూమిపై ఉన్న ప్రతీ వ్యక్తి ఎదరుచూస్తున్నాడు. కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభం అయింది కూడా.
కరోనావైరస్ వ్యాక్సినేషన్‌కు ఢిల్లీ ప్రభుత్వం (Delhi) సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ (vaccination)కు సంబంధించిన ప్రణాళికలన్ని పూర్తిచేశామని కేజ్రీవాల్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన వెంటనే సీఏఏ అమలును పరిశీలిస్తామని అమిత్ షా (Amit Shah) ప్రకటించారు.
ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ( Israel ) శనివారం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రే తొలి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వేయించుకోని ఆదర్శంగా నిలిచారు.
Corona Vaccine | ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న కరోనావైరస్ వ్యాక్సిన్ అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. త్వరలో భారతదేశంలో కూడా ఈ వ్యాక్సిన్ లభించే అవకాశం ఉంది.
Coronavirus Vaccine | ప్రపంచంలో కరోనావైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న వారి కోసం వ్యాక్సిన్ క్యూలో రానున్నాయి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అమెరికా లాంటి దేశాలే కాకుండా వివిధ ప్రైవేటు సంస్థలు కూడా వ్యాక్సిన్ కోసం క్యూకడుతున్నాయి.
Pfizer vaccine in UK News Updates: ఫైజర్-బయోఎన్‌టెక్ రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను యూకేలో తీసుకోనున్న మొదటి వ్యక్తిగా భారత సంతతికి చెందిన 87 ఏళ్ల హరి శుక్లా నిలవనున్నారు. నేటి నుంచి యూకేలో ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించనున్నారు.
ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ (COVAXIN) తుది దశ క్లినికల్ ట్రయల్స్ ఇటీవల దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కోవ్యాక్సిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DGCI) కి దరఖాస్తు చేసింది.
కోవ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా టీకా తీసుకున్న హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ( Haryana Health Minister Anil Vij ) కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షలో (Coronavirus) కరోనా పాజిటివ్‌గా తెలినట్లు అనిల్ విజ్ శనివారం ఉదయం తెలిపారు.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారిని అరికట్టేందుకు భారత్‌లో తయారవుతున్న పలు వ్యాక్సిన్ల పురోగతి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమీక్షించిన విషయం తెలిసిందే. శనివారం ఆయన అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే నగరాల్లో పర్యటించి జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్లను సందర్శించారు.
ఫార్మ దిగ్గజం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్ (ICMR) తో కలిసి పని చేస్తోందని మోదీ పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.