YS Jagan Grand Entry: కృష్ణాజిల్లాలో మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పామర్రు, పెడన, మచిలీపట్నం ప్రాంతాల మీదుగా వెళ్తుండగా ప్రజల నుంచి భారీ ఘన స్వాగతం లభించింది. అడుగడుగునా అభిమానులు భారీ స్వాగతం పలికారు.
YS Jagan In Crop Fields: మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడి పంట నష్టపోయిన రైతులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. పంట పొలాల్లోకి దిగి కన్నీటిలో మునిగిన రైతులను కలిసి భరోసా ఇచ్చారు. తానున్నానని.. చంద్రబాబును ఒప్పించి నష్ట పరిహారం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.
Ex CM YS Jagan In Crop Fields Photos Goes Viral: మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పంట పొలాల్లోకి దిగి కన్నీటిలో మునిగిన రైతులకు తానున్నానని భరోసానిస్తూ పరామర్శించారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
Telangana Rains: తెలంగాణలో మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి.మొంథా తుపాను శాంతించి అనుకునేలోపు బంగాళాఖాతంలో మరో అల్ప పీడనంతో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా నవంబర్ వంటి అన్ సీజన్ లో వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అంతేకాదు వరంగల్ సహా పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో కాపుకు వచ్చిన పంటలు తడిసి ముద్దవుతున్నాయి.
Jagan On Montha Cyclone: మొంథా తుపాను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ విమర్శలు చేశారు. "తుపాను నిర్వహణపై బాబుగారివి పిట్టలదొర మాటలు" అంటూ దుయ్యబట్టారు.
Telugu States Rain Updates: మొంథా తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి రైతులు ఇంకా కోలుకోకముందే, వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మళ్లీ బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Floods:వరంగల్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరదలో మునిగిపోయిన సమ్మయ్య నగర్, నయీం నగర్ ను పరిశీలించి బాధితులతో మాట్లాడారు.
Telangana Paddy Loss: మొంథా తుపాను బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా వుండనుంది. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. గురువారమే వెళ్లేందుకు ఆయన సిద్ధపడగా.. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదని పేర్కొంటూ ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు. దీంతో ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని స్వయంగా పరిశీలిస్తారు.
గత మూడు రోజులుగా ఏపీతో పాటు తెలంగాణను అతలాకుతలం మొంథా తుపాను బలహీన పడింది. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. తీరం దాటిన తర్వాత బలహీనపడిన మొంథా తుఫాన్, ప్రస్తుతం తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ ఘడ్ ప్రాంతాలపై వాయుగుండంగా కేంద్రీక్రుతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో వర్షపాతం తీవ్రత గణనీయంగా తగ్గిపోయింది. వాయుగుండం తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ ఘడ్ ప్రాంతాల వైపు కదులుతోంది.
Cyclone Montha Storm hit At Antarvedi: మోంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో అంతర్వేది కూడా పూర్తిగా అతలాకుతలం అయింది. అక్కడి సీ ఫుడ్ వ్యాపారులు తీవ్ర వేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి స్వయానా తుఫాను ఆపారని వాళ్లు ఆనందం వ్యక్తం చేశారు.ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Tirumala Video: మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో శేషాచల కొండలు పచ్చదనంతో సరికొత్త అందాలు సంతరించుకున్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని మాల్వాడి గుండం జలపాతం కనువిందు చేస్తోంది. ఎత్తైన కొండలపై నుంచి పాల నురుగులా దూకుతున్న జలపాతాల హొయలు మంత్రముగ్దులను చేస్తున్నాయి. మోకాళ్ళ మెట్టు సమీపంలోని అక్కగార్ల గుడి దగ్గర ఎత్తైన బండరాళ్ళపై నుంచి జాలువారుతున్న జలధారలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ వర్షాలతో శేషాచల కొండలలో సెలయేర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. మరో వైపు మేఘాలు దిగి నేలకి వచ్చినట్టు భూలోక స్వర్గంలా కనిపిస్తుంది. తిరుమల వెళ్లే భక్తులు ఈ దృశ్యలు చూసి మైమరచిపోతున్నారు.
Montha Cyclone Live Updates: ఉరుము వచ్చి మంగళం మీద పడ్డట్టు మొంథా తుపానుతో ఆంధ్ర ప్రదేశ్ మొత్తంగా ఆగమాగం అయింది. మరోవైపు మొంథా తుపాను దిశ మార్చుకొని తెలంగాణపై విరుచుపడుతుంది. దీంతో ఏపీతో పాటు.. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Warangal Floods: 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.
Cyclone montha Effect on Warangal: వరంగల్ నగరం అంతా కుండపోత వానకు అతలాకుతలం అయిపోయింది. రహదారులన్ని జలమయం అయిపోయాయి. ఎక్కడ చూసిన కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో భారీగా వదరనీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Montha Effect on Telangana: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని లత్తీపూర్ గ్రామం సమీపంలో ఉన్న హైదరాబాద్–శ్రీశైలం రోడ్డు కొట్టుకునిపోయింది. దీంతో ఆ మార్గంలో ఉన్న రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Montha Cyclone Effect On Telangana : తెలంగాణపై మొంథా తుపాను దిశ మార్చుకుని విరుచుకుపడింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Cyclone montha: మొంథా ఎఫెక్ట్ తో.. కడపలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు.. జగద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం కుప్పకూలిపోయింది. బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మంత్రి నారాలోకేష్ సైతం ఆరా తీశారు.
Khammam: మొంథా ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఖమ్మంలో భారీగా వానలు దంచికొడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించి, ఓ డీసీఎం వ్యాను కొట్టుకుపోగా, డ్రైవర్ గల్లంతయ్యాడు. స్థానికులు వద్దని వారిస్తున్నా వినకుండా ముందుకు వెళ్లడం వల్ల డ్రైవర్, డీసీఎంతో పాటు కొట్టుకునిపోయాడు. ఈ ఘటన ఖమ్మంలో విషాదకరంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.