Delhi Blast Muzammil Shakeel: ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన భారీ పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ విచారణలో ఇప్పుడు మరిన్నీ కీలక అంశాలు వెలుగు చూశాయి. జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న 'వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్' దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర పన్నినట్లుగా సమాచారం.
Delhil bombblast Secret Operation: దేశ రాజధాని ఢిల్లీ కారు పేలుడు కేసులో నిందితులు దేశంలో పలు భారీ దాడులకు కుట్ర పన్నినట్లు తేలిన విషయం తెలిసిందే. వీటిపై అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వారి రహస్య కమ్యూనికేషన్ విధానంపై దృష్టి సారించారు.
Delhi Blast DNA Test Confirms: ఢిల్లీ పేలుడు ఘటనలో బిగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. కారు బ్లాస్ట్ అయ్యే సమయంలో ఎర్రకోట వద్ద కారులో ఉన్న వ్యక్తి ఎవరో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే కారులో ఉన్న డీఎన్ఏ ప్రకారం ఉమర్ కుటుంబ సభ్యులతో సరిపోలిందని తేలింది. ఈ నేపథ్యంలో కారు బ్లాస్ట్ అయ్యే సమయంలో ఉన్నది డాక్టర్ ఉమర్ అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
Delhi Red Fort Blast update:ఢిల్లీ పేలుడు ఘటనలో రోజుకో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలుడుకు కారణమైన ఐ20 కారు.. అంతకుముందు 11 గంటలపాటు పలు ప్రాంతాల్లో ప్రయాణించినట్లు తేలింది.
Delhi Red Fort Blast update: ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లకు హైదరాబాద్ లో కుట్ర జరిగిందని పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద సంబంధాలతో దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి వ్యూహరచన చేసినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి.
Pm modi serious on delhi car blast incident: రెండు రోజుల పర్యటన నేపథ్యంలోప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఢిల్లీలోని పేలుడు ఘటనపై సీరియస్ అయ్యారు. అంతేకాకుండా.. దీని వెనుకాల ఉన్న బాధ్యుల్ని ఎవర్ని కూడా వదలబోమన్నారు.
Delhi Red Fort Blast update: బిహార్ రెండో దశ ఎన్నికలకు ఒక్క రోజు ముందు దేశ రాజధాని ఢిల్లీలో అది కూడా ఎర్రకోట వద్ద బాంబ్ బ్లాస్ట్ తో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత కొన్ని రోజులుగా దేశంలో ఉగ్రదాడి జరుగుతుందనే నిఘా వర్గాల సమాచరంలో దేశంలో పలు ప ప్రాంతాల్లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు జరిగింది.
Delhi Red Fort Blast: ఢిల్లీలోని ఎర్రకోటకు సమీపంలో పేలుళ్ల ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మోదీ నాయకత్వంలో ఇలాంటి దాడులను ప్రభుత్వం ఉపేక్షించిదని.. కుట్రదారులు ఊపిరి పీల్చుకునేలోపు మట్టుబెట్టడం ఖాయమని స్పష్టం చేసింది.
Delhi Terror Blasts History: నవంబర్ 10వ తేదీ సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న కారు బాంబు పేలుడులో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 14 సంవత్సరాల తర్వాత ఢిల్లీ మళ్లీ ఇలాంటి భయానక దృశ్యాలను చూసింది. చివరిసారిగా 2008లో దేశ రాజధానిలో వరుస పేలుళ్లు సంభవించాయి. దేశ పరిపాలనా కేంద్రంగా నిలిచిన ఢిల్లీ, భద్రతా వ్యవస్థ, ప్రజాస్వామ్య స్థిరత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. అయితే గత నాలుగు దశాబ్దాలుగా దేశ రాజధాని ఉగ్రదాడులతోపాటు.. భీభత్స సంఘటనలను ఎదుర్కొంది.
Delhi Blast Narendra Modi KCR YS Jagan Chandrababu And Other VVIPs Deeply Shocked: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు సంభవించడంతో యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. బాంబు పేలుళ్లపై మోదీ, కేసీఆర్, వైఎస్ జగన్, అమిత్ షాతో సహా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Blast: పహల్గామ్ ఉగ్రదాడి ఎవరూ మరకముందే ఇప్పుడు మరో భారీ పేలుడు సంభవించింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 10 మరణించారు. మరో 30 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల భారత సెక్యూరిటీ ఏజెన్సీలకు నివేదించిన నివేదికల ప్రకారం, పాకిస్టాన్ నేపథ్యంతో పని చేస్తున్నట్టు గుర్తించిన ట్రాన్స్‌పరెంట్ ట్రైబ్ అనే హ్యాకర్ గ్రూప్ భారత్ ప్రభుత్వ, సైనిక నెట్‌వర్క్‌లపై లక్ష్యంగా విధ్వంసక చర్యలు చేపట్టినట్లు ప్రతి స్థాయిలోనూ గుర్తించింది. ఈ గ్రూప్ ఛాయలో పనిచేస్తున్న సైబర్ సెల్స్ తమ మెథడ్స్‌ను మారుస్తూ, పబ్లిక్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లను వదిలి ప్రైవేట్ సర్వర్లను ఉపయోగించడం ప్రారంభించారని
Delhi red fort car blast: ఢిల్లీలో భారీ పేలుడుతో దేశ వ్యాప్తంగా అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. దీనిలో భాగంగా హైదారబాద్ లో సీపీ సజ్జనార్ రంగంలోకి దిగారు. పలు ప్రాంతాల్లో నాకా బంది ఏర్పాటు చేసి మరీ తనిఖీలు చేపట్టారు.
Delhi Blast : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ స్థలంలో నిలిచి ఉంచిన ఓ కారులో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది మరణించారు. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎల్ఎన్ జేపీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనాస్థలానికి సంబంధించిన ఫొటోలను చూస్తుంటే మనస్సు కలచివేస్తోంది.
Delhi red fort blast news: ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది వరకు గాయపడినట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రదేశంలో శరీరాలు పూర్తిగా చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. మొత్తంగా 8 కార్ల వరకు ధ్వంసమైనట్లు స్థానికులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.