Delhi New CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 5 జరిగాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలుబడ్డాయి. ఫలితాలు వెలుబడి 10 రోజులు దాటుతున్న సీఎం పీఠం దక్కేది ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. దాదాపు 27 యేళ్ల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి సింహాసనంపై బీజేపీ కి చెందిన వాళ్లు కూర్చోనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Punjab Politics: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు పంజాబ్ రాజకీయాలు పడ్డాయా.. ? ఢిల్లీ తర్వాత పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇపుడు ఆ ఒక్క రాష్ట్రంలోనే అధికారంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఓటమి చవి చూసిన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇపుడు పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కోతున్నారా అంటూ ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు.
Atishi Marlena Resign to CM Post: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి లిక్కర్ కుంభ కోణం అతిపెద్ద మచ్చగా మారింది. ఈ స్కామ్ లోనే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన ప్లేస్ లో తను చెప్పినట్టు వినే ఆతిషికి ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్న ఆతిషి రాజీనామా చేసారు.
Delhi CM Race: దాదాపు 27 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఢిల్లీ సీఎం పీఠం బీజేపీ వశం అయింది. అంతేకాదు దాదాపు 48 సీట్లలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తరుపున ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఢిల్లీ సీఎం రేసులో అరవింద్ కేజ్రీవాల్ ను చిత్తు చేసి జెయింట్ కిల్లర్ పర్వేష్ వర్మతో పాటు మరో ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి.