Fibrebond CEO:పూర్వికుల సంపద పెట్టుబడిగా మారింది... స్థాపించిన పరిశ్రమ అగ్నిప్రమాదంతో బూడిదపాలైంది...నాన్న కష్టార్జితం కనుమరుగైపోయింది. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.... ఏమీ చేయలేని పరిస్థితి... ఇవంతా జీవితంలో ఊహించని పరిణామాలు.. అయినా ఉద్యోగులను దూరం చేసుకోలేదు... ఆ కుటుంబాలను పోషించారు. కలిసొచ్చినకాలంలో.. అద్భుతాన్ని ఆవిష్కరించారు. కష్టంలో అండగా నిలిచి.. కంపెనీ వృద్ధిలో భాగమైన ఉద్యోగులకు ఫైబర్ బ్రాండ్ యజమాని గ్రాహం వాకర్ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. జీవితకాలంలో ఊహించని గిఫ్ట్ తో ఆ ఉద్యోగులు ఎవరికివాళ్లు మైమరచిపోయారు.
CEO Gives rs.2,000 Crore in Bonus to Employees: ఉద్యోగులకు ఓ సీఈవో ఎవరూ ఊహించలేని భారీ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా 540 మంది ఉద్యోగులకు రూ. 2000కోట్ల బోనస్ కేటాయించారు. అమెరికాలోని ఫైబర్‌బాండ్ సీఈఓ గ్రాహమ్ వాకర్ తన కంపెనీని అమ్మి, అందులోని రూ. 2,000 కోట్లను 540 మంది ఉద్యోగులకు బోనస్‌గా కేటాయించారు. ఒక్కో ఉద్యోగికి సుమారు రూ. 4 కోట్లు లభించనున్న ఈ నిర్ణయం తీసుకున్న సీఈఓకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.