Vasant Panchami 2025 Telugu Wishes:వసంత పంచమి అనేది వసంత ఋతువు ప్రారంభానికి సూచికగా జరుపుకునే ఒక హిందూ పండుగ. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ పండుగను మాఘ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథినాడు జరుపుకుంటారు. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం, పసుపు రంగు పదార్థాలను తినడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున సరస్వతి దేవిని పూజించడం వల్ల జ్ఞానం, వివేకం, సృజనాత్మకత పెరుగుతాయని నమ్ముతారు.