Operation Sindoor 3 Stages: అప్పటి వరకు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేయడానికి పహల్గాంకు వచ్చిన వాళ్లకు ఆ రోజు చీకటి రోజుగా మారింది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ లో 26 మంది కుటుంబాల్లో అది పీడకలగా మారింది. ఇది ఒక కుటుంబంపై జరిగిన దాడి కాదు. జాతి మొత్తంపై జరిగిన దాడిగా భావించిన కేంద్రం ప్రతికారం తీర్చుకుంది. మహిళల నుదుటిన సింధూరం తుడిచేసిన ఉగ్రమూకలను అంతం చేయడానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అంతేకాదు 86 గంటల్లో గుంట నక్క పాకిస్థాన్ ను మనకు దాసోహం అనేలా చేసింది. ఈ మొత్తం ఆపరేషన్ ఎలా జరిగిందనే విషయానికొస్తే..
Operation Sindoor: దేశాన్ని ప్రేమిస్తే ప్రాణమిస్తాం... ద్వేషిస్తే అంతులేకుండా చేస్తాం... ఇదీ భారత సైన్యం సంకల్పం... పర్యాటక స్థావరాన్ని చూసొద్దామని వెళ్లిన అమాయకుల ప్రాణాలను దుర్మార్గులు బలిగొన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యతో సైనికుల రక్తం మరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో సైనిక బలగాలు ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాద స్థావరాలను భూస్థాపితం చేశాయి. ప్రాణాలు కోల్పోయిన వారికి ఆపరేషన్ సింధూర్ ఆత్మశాంతి చేకూర్చింది. కోట్ల మంది భారతీయుల్లో మనోధైర్యాన్ని నింపింది. భారతసైన్యం సత్తా ఏంటో గంటల్లో నిరూపించింది.
Asaduddin Owaisi: దేశ రాజకీయాల్లో ఆయన ఓ విలక్షణ నాయకుడు… జాతీయ రాజకీయ పార్టీకి అధ్యక్షుడు... వేదిక ఏదైనా సరే ఆయన మాట తీరే వేరు…. నిన్న మొన్నటిదాకా.. ముస్లింలపై మాట పడనిచ్చేవాడుకాదు.. తాజాగా ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజకీయ నాయకులను ఆలోచింపజేశాయి. ఇపుడు ఏ ఇద్దరు కలిసి మాట్లాడినా… ఆయన మాటలపైనే చర్చసాగుతోంది. ఇంతకీ ఎవరాయన? ఏమన్నారు? ఎందుకొచ్చింది ఆయనలో మార్పు? కాలక్రమంలో ఆయనలో వచ్చిన పరివర్తనకు కారణమేంటి?
Trump Targets India: భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు నిర్వహించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి యూఎన్ వేదికగా ప్రకటించారు.
Jammu and kashmir Poonch: దాయాది మరోసారి తన వంకర బుద్దిని చూపేట్టింది. పూంచ్ పరిధిలో పదిహేను నిమిషాలు పాటు కాల్పులకు తెగబడింది. ఇండియన్ ఆర్మీ సైతం పాక్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
Modi Speech On Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన హంతకులను మట్టిలో కలిపినందుకు యావత్ భారత్ మొత్తం విజయోత్సవాలు చేసుకుంటోందని పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
India - Pakistan: పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌తో భారత్ గట్టి సమాధానం ఇవ్వడంతో ఆ దెబ్బకు పాక్ ఇంకా కోలుకోలేదు. అప్పుడు జరిగిన నష్టాన్ని పూరించుకోవడటానికి పాకిస్థాన్ నానా తంటాలు పడుతోంది. పాకిస్థాన్ ఇప్పటికీ రిపేర్లు చేసుకుంటూనే ఉంది.
anil Chauhan on Indian army: భారత సీడీఎస్ అనిల్ చౌహన్ భారత సైత్యం అత్యాధునిక టెక్నాలజీని ఇంకా అందిపుచ్చుకొవాల్సిన అవసరం ఉంటన్నారు. అదే విధంగా ఆపరేషన్ సిందూర్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తన కపటబుద్ధిని బయట పెట్టుకున్నారు. తనకు పాకిస్థాన్ అంటే చాలా ఇష్టం అని యుద్ధాన్ని తానే ఆపానని తెలిపారు. ఐ లవ్ పాకిస్థాన్ అని వ్యాఖ్యానించారు. మోడీ గొప్ప వ్యక్తి అని నిన్న రాత్రే ఆయనతో మాట్లాడానని చెప్పారు.
Modi phone call to trump: భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతల విషయంలో మూడో దేశం జోక్యం అవసరంలేదని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Fighter Jets: ఆపరేషన్ సింధూర్ ముగిసింది. ఉగ్ర, వైమానిక స్థావరాల ధ్వంసంతో పాకిస్తాన్ తోక ముడిచింది. అంతవరకూ బాగానే ఉంది. మరి ఇండియా ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయిందనేది చర్చనీయాంశంగా మారింది. విదేశీ మీడియా చెబుతున్నదేంటి, వాస్తవమేంటో తెలుసుకుందాం.
Mock Drill: ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ ఎనీటైం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ చర్యలతో భారత్ అలర్ట్ అయ్యింది. భారత్‌ను శాశ్వత శత్రువుగా భావిస్తున్న పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో యుద్ధానికి ఆర్మీ సంసిద్ధంగా ఉంది.
Mock drill in border states: ఇండియా, పాక్ లతో బార్డర్ పంచుకుంటున్న నాలుగు స్టేట్స్ లలో మాక్ డ్రిల్ కు కేంద్రం సన్నాహాలు చేపట్టింది.ఈ క్రమంలో మరోసారి ఏంజరగబోతుందని దానిపై ఉత్కంఠ నెలకొంది.
India - Pakistan: పహల్గామ్ దాడి వెనుక CRPF జవాన్ మోతీ రామ్ జాట్ హస్తం ఉందని గుర్తించిన అధికారులు...అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
India - Pakistan: పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా జరిపిన దాడుల్లో పాకిస్తాన్‌లోని 200 మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.
India - Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తో పాకిస్థాన్ దేశం కకావికలమైంది. ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో పాకిస్థాన్ పరిస్థితి కుడిలో పడ్డ ఎలుకలా తయారైంది. అంతేకాదు ఏకంగా ఆ దేశ హోం మినిస్టర్ ఇంటిని తగులబెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
IMF Big Shock To Pakistan: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాత్కాలిక ఊరటనిచ్చింది. బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఈ సాయం ఉచితంగా మాత్రం అందడం లేదు. ఐఎంఎఫ్ ఏకంగా 11 షరతుల కొండనే పాక్ ముందు ఉంచింది. గతంలో విధించిన షరతులు కలుపుకుంటే మొత్తం 50 షరతులను పాకిస్థాన్ నెరవేర్చాల్సి ఉంటుంది.
New Conditions on Pakistan from IMF: పాకిస్తాన్ కు బిగ్ షాకిచ్చింది ఐఎంఎఫ్. బెయిలౌట్ కార్యక్రమం కోసం IMF పాకిస్తాన్‌కు 11 కొత్త షరతులను ఇచ్చింది. రుణం కోసం పాకిస్తాన్ ఈ షరతులకు తప్పకుండా అంగీకరించాల్సిందే. కొత్త షరతుల ప్రకారం, పాకిస్తాన్ భారత్ తో ఉద్రిక్తతను తగ్గించుకోవాలి.
Tomorrow Chandrababu Tiranga Rally In Vijayawada: భారత సాయుధ దళాలకు సంఘీభావంగా నిర్వహించనున్న తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ మేరకు విజయవాడలో భారీ ఏర్పాట్లు జరిగాయి. భారీ స్థాయిలో జరగనున్న ఈ ర్యాలీతో బెజవాడలో త్రివర్ణ పతకాలు రెపరెపలాడనున్నాయి.
BSF Jawan Released: బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను దాయాది ఇటీవల విడుదల చేసింది.ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ విచారణకు పూర్ణమ్ షా షాకింగ్ విషయాల్ని వెల్లడించాడు.
Indus Water Treaty: పహల్గామ్ ఉగ్రదాడి నేపధ్యంలో నిలిచిన సింధూ నదీ జలాల ఒప్పందం దాయాది దేశాన్ని ఇబ్బంది పెడుతోంది. అందుకే నీళ్లు వదలాలంటూ ప్రాధేయపడుతోంది. చర్చలకు సిద్ధమంటూ విజ్ఞుప్తి చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bsf jawan purnam released by pak: భారత్ కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ ను ఇండియన్ ఆర్మీ పాక్ చెరనుంచి విడిపించుకుంది.ఈ క్రమంలో జవాన్ పూర్ణమ్ కుమార్ షా భార్య ఎమోషల్గా మాట్లాడింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.