Iran Crisis Effect On India:ఇరాన్ లో ఉద్రిక్తతలు, అమెరికా దాడులు జరగవచ్చన్న నేపథ్యంలో భారత్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అక్కడున్న భారతీయులు ఆ దేశాన్ని వీడాలంటూ హెచ్చరిక జారీ చేసింది. అందుబాటులో ఉన్న మార్గాల్లో దేశాన్ని వీడాలని సూచించింది. స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిని సురక్షితంగా తీసుకురావడానికి సిద్ధమైంది. నేటి నుంచి ఈ తరలింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు విదేశాంగ శాఖ వర్గాల సమాచారం.
Iran War: ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎయిర్‌స్పేస్ పూర్తిగా మూసివేసింది. ఇరాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ జారీ చేసిన నోటామ్ ప్రకారం ఈ నిర్ణయం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. టెహ్రాన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ పరిధిలోకి వచ్చే ఇరాన్..మొత్తం ఎయిర్ స్పేస్ లోని అన్ని రకాల విమానాల రాకపోకలను నిలిపివేశారు. సివిల్, మిలిటరీ, కార్గో, అలాగే ఇరాన్ మీదుగా దాటే ఓవర్‌ఫ్లైట్లకు కూడా పూర్తిగా నిషేధం విధించారు.
Iran Riots: ఇరాన్ అంతటా నిరసనలు విస్తరిస్తున్నాయి. దేశంలో పెరిగిపోతున్న ఆర్ధికమాద్యం, ధరలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఈ నిరసనలు అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే నిరసనకారులపై పాలకులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో నిరసనకారులపై కాల్పులకు సైతం వెనకాడటంలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.