Telangana Sarpanch Elections: తెలంగాణలో అతి త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఎన్నికలు ఈ నెలాఖరులో లేదా డిసెంబరులో జరిగే అవాకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ బై పోల్ ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండటంతో రేవంత్ రెడ్డి .. త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
MLC Dasoju Sravan Kumar: ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు బూత్‌లను పరిశీలించి పోలీసులు, ఎన్నికల తీరుపై మండిపడ్డారు. ఎన్నికలను ప్రశాంతంగా జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
Jubilee Hills By Election 2025 Voting LIVE Updates: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి మంగళవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఓటింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Jubilee Hills by poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ వద్ద చివరి ఓటు పడేవరకూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రతి ఇంటి నుంచీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, తిరిగి ఇళ్లకు చేరేలా పర్యవేక్షణ బాధ్యతలను పోలింగ్ కేంద్రాల వారీగా పార్టీ నేతలకు అప్పగించింది.
Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ బై పోల్ సర్వం సిద్దం అయింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో బై పోల్ జరగుతుంది. ఈ పోటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా మొత్తంగా 58 అభ్యర్ధులు తమ లక్ ను పరీక్షించుకుంటున్నారు.
Paid Holiday In Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా మరో కీలక ప్రకటన చేసింది జిల్లా యంత్రాంగం. ఇప్పటికే మూడు రోజులు సెలవులుగా ప్రకటించగా.. ఇప్పుడు మరో రోజు జీతంతో కూడిన సెలవును ప్రకటించారు.
Jubilee Hills By Poll As Lady vs Rowdy: అన్నింట్లో విఫలమైన రేవంత్ రెడ్డికి బుద్దిచెప్పాలంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ పార్టీ గెలవాలని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. లేడీ వర్సెస్ రౌడీగా జూబ్లీహిల్స్ ఎన్నిక ఉందని అభివర్ణించారు.
Jubilee Hills By Elections Prediction: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమకు గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. జీ తెలుగు న్యూస్‌తో మాట్లాడిన ఆయన.. అనేక విషయాలను పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్టాప్ అయిందని.. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకుల ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
Shameless Revanth Reddy Politics On Maganti Sunitha Tears: భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాగంటి సునీత కన్నీళ్లపై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి రాజకీయం చేయడం దౌర్భాగ్యమని బీఆర్‌ఎస్ పార్టీ తప్పుబట్టింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jubilee Hills With BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రెచ్చిపోతున్న కాంగ్రెస్ మూకలు, రేవంత్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ముస్లింలకు బెదిరింపులు, దాడులకు పాల్పడడంతో పాటు రేవంత్ రెడ్డి నోటి దూలపై గులాబీ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS Party Khammam Leaders Slams To Revanth Reddy Drama: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎన్టీఆర్ భజన చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు విశేష ప్రాధాన్యం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చారని గుర్తుచేశారు.
Jubilee Hills By Poll 2025: జూబ్లీ హిల్స్ బై పోల్ మూడు ప్రధాన పార్టీలకు పెను సవాల్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గెలుపు ఓటమిలనేది రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్నాయి. ఈ నెల 11న జరగబోతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలున్నాయి.. ? ఎవరు పరాజితులు కానున్నారు ? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో ఎవరు గెలవబోతన్నారు.. ? పలు సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
KTR Sensation Speech In Road Show Of Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ మళ్లీ కొడుతున్నామని.. ఇక్కడి నుంచే తెలంగాణలో మళ్లీ కేసీఆర్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. మాగంటి సునీతను గెలిపించాలని పిలుపునిచ్చారు.
Kamma Voters Likely To Support BRS Party In Jubilee Hills By Poll: ఏపీలో ప్రధాన సామాజికవర్గమైన కమ్మవారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. కేసీఆర్ పాలనలో వీరికి విశేష ప్రాధాన్యం.. గౌరవం దక్కడంతో ఈసారి కూడా మాగంటి కుటుంబానికి మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Ex Minister KTR Hot Comments On Revanth Reddy Failures: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణను రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టించాడని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Jubilee Hills By Poll: ఆరు గ్యారంటీల్లో మోసం.. రేవంత్ రెడ్డి ఘోర వైఫల్యాలను వివరిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో దూసుకెళ్తోంది. మాగంటి సునీత గెలుపు కోసం గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని.. మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసుకుందామని బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది.
BRS Party Big Plan In Jubilee Hills By Poll: తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ దూకుడుగా వెళ్తోంది. మాగంటి సునీత గెలుపు కోసం గులాబీ పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది. రేవంత్ రెడ్డి వైఫల్యాలు, కాంగ్రెస్ మోసాలను వివరిస్తూ ప్రచారంలో దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో అందరి నోట మాగంటి సునీత గెలుపు పక్కా అని వినిపిస్తోంది.
Big Shock To Revanth Reddy: జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఎన్నికల నిబంధన ఉల్లంఘించాడని బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలకు ఆదేశించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
KCR Health Update: ప్రత్యక్షంగా రాజకీయాలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత కెమెరాకు చిక్కారు. పూర్తి ఆరోగ్యంగా.. నిండైన రూపంతో మాజీ సీఎం కేసీఆర్ కనిపించారు. ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష చేయగా.. పార్టీ నాయకులతో సరదాగా మాట్లాడారు. ఆ వీడియో చూడండి.
KCR Review On Jubilee Hills By Poll: ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని.. మాగంటి సునీత గెలుపు ఖాయమైందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గులాబీ అధినేత కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.