Bandi Sanjay emotional comments: ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. కానీ వారు మాత్రం.. బీజేపీకి ఎందుకు ఓటు వేయడంలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
cm revanth reddy meets with Rahul Gandhi: తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల సత్తాచాటిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు, జూబ్లిహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలో మరింత జోష్ తో ముందుకు వెళ్లాలన్నారు.
Naveen Yadav profile: మూడు సార్లు వరుసగా ఓటమి ఎదురైనా వెనక్కు తగ్గడం నవీన్ యాదవ్ స్వభావంలో లేదు. ప్రతి ఓటమి ఆయనకు మరింత బలం ఇచ్చింది. ప్రతి అపజయం ఆయనను ప్రజలకు దగ్గర చేసింది. చివరికి ఇదే ధైర్యం, ఇదే పట్టుదల ఆయనను జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటంలా ముందుకు నడిపింది. సంవత్సరాలుగా రాజకీయ రంగంలో పోరాడుతూ వచ్చిన నవీన్, ఒక్కో ఎన్నికలో ఓడినప్పుడు వదిలేయకుండా .. మరి కొంత నేర్చుకుని, మరింత ప్రజలలో కలిసిపోయి.. చివరకు తానే గెలిచే రోజును సృష్టించుకున్నారు. ఈ ఉపఎన్నికల్లో ఆయన సాధించిన భారీ మెజార్టీ, ఒక సాధారణ విజయం కాదు.. అది ఓటములను అవకాశం గా మార్చుకున్న నాయకుని పట్టుదలకి నిదర్శనం.
cm Revanth reddy Delhi Tour: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లనుండటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Maganti Sunitha slams on congress govt: కాంగ్రెస్ వాళ్లు తాను ఏడిస్తే ఏడ్చానని.. నవ్వితే నవ్వానంటూ రచ్చ చేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మండిపడ్డారు. దయచేసి ఓటర్లంతా బైటకు రావాలని పిలుపునిచ్చారు.
CP Sajjanar on Jubilee hills bypolls: ముఖ్యంగా గుంపులుగా గూమి గూడ వద్దని నియోజక వర్గం పరిధిలో ఎన్నికలు, ఓట్లలెక్కింపు రోజుల్లో ఆంక్షలు పాటించాలని సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Jublee Hills By Elections: తెలంగాణలో మరోసారి కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమైంది..! మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ మంత్రి పదవి కాబోతున్నారు..! మైనారిటీ కోటాలో అజార్‌కు మంత్రి పదవి ఇవ్వాలంటూ హైకమాండ్ ఆదేశాలిచ్చింది..! అజార్‌కు హోంశాఖ కేటాయించవచ్చనే టాక్ సైతం వినిపిస్తోంది..! అయితే పార్టీలో షబ్బీర్ అలీ లాంటి సీనియర్ లీడర్ ఉండగా.. అజార్‌కు మంత్రి పదవి ఎందుకు దక్కింది..! దీని వెనకున్న కారణం ఏంటి..!
ktr fires on cm revanth reddy: జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల వేళ మరోసారి కేటీఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇది కారుకు, బుల్డోజర్ కు మధ్య జరుగుతున్న ఎలక్షన్ అంటూ ఏకీపారేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏదో ఫ్లోలో నిజంచెప్పాడని పంచ్ లు వేశారు.
Jubilee hills by elections: జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు డివిజన్ల వారిగా కీలక బాధ్యతలు అప్పగించారు. మంత్రులు ప్రజల్లో ఉంటూ ప్రచారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Harish rao fires on revanth reddy: మద్యం టెండర్ల ద్వారా ఈ ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లు వచ్చాయని దానిలో సగం రూ.1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆదుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కారుపై మండిపడ్డారు.
Bandi Sanjay fires on brs and congress: బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రెండు కూడా తోడు దొంగల పార్టీలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో రెండు పార్టీలకు చిత్తశుధ్దిలేదన్నారు.
ktr fires on cm revanth reddy: బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో ఎందుకుందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ కు అసలు సిగ్గుందా అంటూ ఏకీపారేశారు.
Former mayor on Jubilee hills byplls: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బీజేపీ నుంచి జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి ఉంటున్నట్లు వస్తున్న వార్తలపై రియాక్ట్ అయ్యారు. దీనిలో అసలు వాస్తవంలేదని కొట్టిపారేశారు. గిట్టని వారు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు.
Naveen Yadav's Background: హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ సీటును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం యువ నాయకుడు నవీన్ యాదవ్ ను అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం మరియు హైకమాండ్ రెండూ నిర్ణయించాయి.
Jubilee Hills By poll Tension: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌లో సీటు పంచాయితీ మొదలైందా..! మాగంటి ఫ్యామిలో టికెట్ లొల్లి జరుగుతోందా..! మాగంటి గోపినాథ్ భార్యకు టికెట్ ఇచ్చే ఆలోచనలో బీఆర్‌ఎస్ హైకమాండ్ ఉంది. కానీ అనుహ్యంగా రేసులోకి మరో లీడర్ దూసుకొచ్చారు. దాంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో హైకమాండ్ తేల్చుకోలేకపోతోందా..! అటు మాగంటి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకపోతే.. తమ పేర్లు పరిశీలించాలని ఇద్దరు గులాబీ లీడర్లు కోరుతున్నట్టు సమాచారం.
Telangana Bypoll: తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరి ఇబ్బందిగా మారారు. ఆలోపే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అకాల మరణం చెందారు. గతంలో లాస్యనందిత మృతిలో కంటోన్మెంట్‌లో బైపోల్ జరిగింది. ఇప్పుడు మరోసారి జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక జరగబోతోంది. జూబ్లీహిల్స్ బైపోల్‌పై గులాబీ బాస్ పరేషన్ అవుతున్నారా..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.