TTD Temple in Kashmir: భూతల స్వర్గంలో శ్రీవారు కొలువుదీరనున్నారు. కశ్మీర్ గడ్డపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం రానుంది. రానున్న 18 నెలల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తికానుందని టీటీడీ ఛైర్మన్ ప్రకటించారు.
జమ్మూకాశ్మీర్ (Jammu Kashmir) లో మళ్లీ కర్ఫ్యూను విధించారు. ఆగస్టు 5తో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 (article 370), ఆర్టికల్ 35ఏ ను రద్దు చేసి ఏడాది పూర్తికానుంది.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( NCERT ) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలోని ఒక చాప్టర్‌ను సవరించింది. ఆ పాఠ్యాంశంలో ఉన్న ‘జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాద రాజకీయాలు’ అనే చాప్టర్‌ను తొలగించింది.
Terrorists Killed In Kulgam Encounter | సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనాలు తరచుగా భారత్‌తో కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్లో చొరబడ్డ ఇద్దరు ఉగ్రవాదులను కాశ్మీర్ పోలీసులు, భద్రతా సిబ్బంది ధైర్యంగా ఎదుర్కొన్నారు. పోలీసుల ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో నేడు (బుధవారం) జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రత్యేక పోలీసు అధికారి (ఎస్పీఓ) తో సహా పౌరుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
కశ్మీర్లో 2019, ఆగస్టు 5న ఆర్టికల్ 370 తొలగించిన సందర్భంలో కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవడం, పలు చోట్ల ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు హింసకు దారితీయడం తెలిసిందే. అయితే, కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఇప్పటికే 7 నెలల పూర్తయింది. అక్కడ విధించిన పలు ఆంక్షలను సైతం కేంద్రం క్రమక్రమంగా ఎత్తివేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్లో పరిస్థితి ఎలా ఉంది ? ప్రస్తుత పరిస్థితిపై కశ్మీరీలు ఏమంటున్నారు ? ఆర్టికల్ 370 రద్దు తర్వాత వారి జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా ? ఆందోళనకారులు చెప్పినట్టుగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు మా జీ టీవీ
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. అక్కడ పాక్ ఆర్మీ ఛీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాని కౌగలించుకోవడం ఓ దుశ్చర్య అని.. ఈ పనిచేసినందుకు సిద్ధూకు భారత ప్రభుత్వం మరణశిక్ష విధించినా తప్పు లేదని బీజేపీ మైనార్టీ మోర్చా నేత అఫ్తాబ్ అద్వానీ అన్నారు.
పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలలలో పిల్లల సోషల్ స్టడీస్ టెక్స్ట్ పుస్తకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే.. పలు ప్రైవేటు పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో కాశ్మీర్ భారతదేశంలో ఉందని తెలియజేసే మ్యాపులు ప్రచురితమవ్వడమే అందుకు కారణం.
ఆ వీడియో వైరల్ అయ్యి ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీ వరకూ చేరింది. ఆ వీడియోను మోదీ ట్విటర్లో షేర్ చేస్తూ ఆ చిన్నారి చేస్తున్న పనిని ఎంతగానో మెచ్చుకున్నారు.
కాశ్మీరు వేర్పాటువాది మరియు హురియత్ నేత సయ్యద్ అలీషా జిలానీ కాశ్మీర్ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ, తమ పిల్లలను ఎవరూ ఆర్మీ పాఠశాలలకు పంపించవద్దని హితవు పలికారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.