మధుప్రియ.. ఈ పేరు తల్చుకుంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేంది. 'ఆడపిల్లనమ్మా..' అనే పాట. ఐదవ తరగతి చదువుతున్నప్పుడే ఈ పాట పాడి చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ గాయని రీసెంట్ గా 'బిగ్ బాస్' రియాలిటీ షోతో మరింత పాపులర్ అయింది. సరిగ్గా 18 ఏళ్ళు నిండి 30 రోజులు కూడా పూర్తి కాకుండానే తను ప్రేమించిన శ్రీకాంత్ ను పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోడం, మనస్పర్ధలొచ్చి వార్తల్లోకెక్కడం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఇద్దరు సంతోషంగానే ఉన్నారు. ఇటీవల 'ఫిదా'లో 'వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే' అనే పాటతో అందరి మన్ననలు పొందింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.