Telangana Corp Loss: మొంథా తుపాను కారణంగా తెలంగాణలో లక్షా 17 వేల 757 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ నివేదికను సమర్పించింది. తుఫాన్ కారణంగా నష్టం వాటిల్లిన జిల్లాలలో పర్యటించిన వ్యవసాయశాఖ అధికారుల బృందం, దెబ్బతిన్న పంటల వివరాలను, సర్వే చేసి నివేదికను సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Telangana Floods:వరంగల్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరదలో మునిగిపోయిన సమ్మయ్య నగర్, నయీం నగర్ ను పరిశీలించి బాధితులతో మాట్లాడారు.
Telangana Paddy Loss: మొంథా తుపాను బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా వుండనుంది. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. గురువారమే వెళ్లేందుకు ఆయన సిద్ధపడగా.. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదని పేర్కొంటూ ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు. దీంతో ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని స్వయంగా పరిశీలిస్తారు.
Telangana Farmers struggle: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలు రైతులకు కడగండ్లు మిగుల్చాయి. ఆరుగాలం శ్రమించే రైతన్న నోట్లో మట్టి కొట్టాయి. భారీ వర్షాలతో సాగు కోసం రైతన్న పడిన కష్టాలు నీటి పాలయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.