India Vs USA T20 World Cup: టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు యూఏఎస్ గట్టి పోటీని ఇచ్చినా.. చివరికి విజయం భారత్‌ను వరించింది.
Pakistan Vs Netherlands T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ ఎట్టకేలకు శుభారంభం చేసింది. కొలంబో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాక్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, టోర్నీలో బోణీ కొట్టింది. అయితే, పసికూన నెదర్లాండ్స్ బౌలర్లు పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి ఒక దశలో విజయం ముంగిట నిలిచారు.
Team India: నేటి నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్ నెదర్లాండ్స్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య శ్రీలంకలో జరగనుంది. అలాగే, భారత్‌లో స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది. అలాగే, భారత జట్టు కూడా టోర్నమెంట్ తొలి రోజు నుంచి బరిలోకి దిగనుంది. యూఎస్ఏతో తన తొలి మ్యాచ్ ఆడేందుకు సూర్య కుమార్ యాదవ్ సేన రెడీ అయింది. ఈ నేపథ్యంలో జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.
T20 World Cup:టి20 ఫార్మాట్‌లో పదో ప్రపంచ కప్‌కు సమయం ఆసన్నమైంది. భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి నేడు తెర లేవనుంది. ఐసీసీ టోర్నీల్లో పొట్టి ప్రపంచకప్‌కు ఉండే క్రేజ్ వేరు. మెరుపులు మెరిపించే బ్యాటర్లు.. బుల్లెట్ లాంటి బంతులను సంధించే బౌలర్లు.. ఫీల్డింగ్ విన్యాసాలు..ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్‌లు, సూపర్ ఓవర్‌లు.. ఇలా టీ20 వరల్డ్ కప్ అంటే అభిమానుల్లో ఆసక్తి ఎక్కువే.
Suryakumar Yadav: మరో రెండు రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. అయితే.. ఈ మెగా టోర్నీలో భారత్‌తో మ్యాచ్‌ను ఆడబోమని పాక్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. తాజాగా భారత్‌తో మ్యాచ్ ఆడమని పాక్ ప్రభుత్వ ప్రకటనపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి స్పందించాడు.
Ishan Kishan Innovative Shot Video: టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులను ఎదుర్కొన్న అతడు 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అన్రిచ్ నోర్ట్జే బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ కొట్టిన ఓ సిక్స్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్రిచ్ నోర్ట్జే వేసిన బౌన్సర్‌ను ఇషాన్ చాలా తేలికగా సిక్స్ బాదాడు. అలా అని అతడు మరీ బలంగా బాదలేదు. బౌన్స్ అయి శరీరం మీదికి దూసుకువచ్చిన బంతిని
Twenty 20 World Cup:టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్, భారత్‌తో మ్యాచ్ ఆడదని పాక్ ప్రధాని షెహబాజ్ మరోసారి ధ్రువీకరించారు. ఇస్లామాబాద్‌లో మంత్రివర్గాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Pat Cummins Ruled Out Of IPL: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు మింగుడుపడని వార్త అందుతోంది. జట్టును ముందుండి నడిపించే కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెన్నునొప్పి సమస్య తలెత్తడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ICC T20 World Cup 2026: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు టీవీల ముందు అతుక్కుపోతారు. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు చాలా కాలంగా జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలోనే ఈ జట్లు తలపడుతున్నాయి. అందుకే ఇలాంటి మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇది ఐసీసీకి చాలా పెద్ద ఆదాయ మూలం. అయితే భారత్‌తో ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదని పాక్ స్పష్టం చేసింది. మరి ఈ మ్యాచ్ జరక్కపోవడం వల్ల ఐసీసీ ఎంత నష్టపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Sunil Gavaskar on India Vs Pakistan Match: భారత్‌పై మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడంపై సునీల్ గవాస్కర్ స్పందించారు. ఐసీసీ ఈ విషయంలో జోక్యం చేసుకుని.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో టీమ్ ఇలాంటి నిర్ణయం తీసుకునే ఆలోచన చేయకుండా చర్యలు ఉండాలన్నారు.
ICC Ultimatum To Pakistan: 2026 టీ20 ప్రపంచకప్ వేదికల విషయంలో ఇన్నాళ్లూ డ్రామా నడిపిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటామంటూ ఊదరగొట్టిన పాక్, ఇప్పుడు యూ-టర్న్ తీసుకుని ఏకంగా తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.
ICC Ultimatum To Bangladesh Update: 2026 టీ20 ప్రపంచకప్ ఆతిథ్యంపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. భద్రతా కారణాల సాకుతో భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గట్టి హెచ్చరిక జారీ చేసింది.
Bangladesh Ireland T20 World Cup: 2026 టీ20 ప్రపంచకప్‌నకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వేళ, టోర్నీ ప్రారంభానికి ముందే ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత చూపడం, దానికి ఐర్లాండ్ షాక్ ఇవ్వడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ICC T20 World Cup Americas Qualifier: వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026 ఆతిథ్య దేశమైన భారత్, అమెరికా (USA) క్రికెట్ జట్టుకు గట్టి షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది.
Shubman Gill: టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే టీమిండియా జట్టులో స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. అయితే ఇన్ని రోజులు ఈ విషయం గురించి మాట్లాడకుండా మౌనంగా ఉన్న గిల్ తాజాగా స్పందించాడు. సెలక్టర్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు.
India Vs Bangladesh T20 World Cup 2026: తమ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలని ఐసీసీని బంగ్లాదేశ్ కోరింది. అయితే ఒకవేళ మ్యాచ్‌లను తరలిస్తే.. బీసీసీఐ నష్టం వస్తుందా..? లేదా ఐసీసీకి వస్తుందా..? పూర్తి వివరాలు ఇలా..
Team India Playing 11 in T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఎలాగైనా మరోసారి కప్ కొట్టాలనే లక్ష్యంతో ఉంది. అందుకే టీమ్ సెలెక్షన్‌లో కూడా సంచలన మార్పులు చేసింది. వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి తప్పించింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొట్టిన ఇషాన్ కిషన్‌ను టీమ్‌లోకి తీసుకుంది. జితేశ్ శర్మ స్థానంలో రింకూ సింగ్ కూడా టీమ్‌లోకి వచ్చాడు. మరీ ప్లేయింగ్11 లో ఎవరికి చోటు దక్కుతుంది..? ఎవరు బెంచ్‌పై కూర్చుంటారు..? ఇక్కడ చూద్దాం..
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది ప్లేయర్లకు ఈ జట్టులో చోటు ఇచ్చింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే భారత్ బరిలోకి దిగనుండగా.. వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. అయితే జట్టు ఎంపికపై అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడాడు.
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. తాజాగా ఈరోజు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. పాపం శుభ్‌మన్ గిల్‌కు మాత్రం జట్టులో స్థానం లభించలేదు. వరల్డ్ కప్ పోరు 2026 ఫిబ్రవరి 7న ప్రారంభం కానుండగా.. మార్చి 8న తుది పోరు జరగనుంది.
T20 World Cup 2026 Schedule: క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ అధికారిక షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీన మొదలుకానున్న ఈ టోర్నమెంట్.. మార్చి 8వ తేదీ 2026 వరకు కొనసాగుతుంది. దాదాపు 30 రోజుల పాటు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించబోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.