Harish Rao Allges Revanth Reddy Govt Fails In Govt Jobs: తెలంగాణ గ్రూపు పరీక్షల నిర్వహణలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నిరుద్యోగులకు మద్దతుగా తాము ఉంటామని ప్రకటించారు. గ్రూపు పరీక్షల విషయంలో రేవంత్ ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు.
Telangana IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ ల భారీ బదిలీలకు తెరతీసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు మరోసారి భారీగా జరిగాయి. రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో 20 మంది కలెక్టర్లు బదిలీ అయ్యారు.
Telangana RTC Ticket Charges Hike: తెలంగాణ ఆర్టీసీ టికెట్ ధరలు అమాంతం పెంచేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ టోల్ చార్జీలను పెంచినసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ టోల్ చార్జీలను ఆకస్మికంగా పెంచేసింది.
Hyderabad: తెలంగాణ ప్రజాభవన్ మరికాసేపట్లో పేలిపోతుందంటూ ఆగంతకుడు కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం ఒక్కసారిగా హైదరాబాద్ లో హైటెన్షన్ గా మారింది.
Revanth Reddy Govt Collapse In August: లోక్సభ ఎన్నికలు అలా ముగిశాయో లేవో మళ్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఆగస్టులోపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండడని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ మంత్రులే ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Martyr Srikantha Chary: తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారీ తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల వేళ ఈ ఘటనతో బీఆర్ఎస్ కు షాక్ గా మారిందని చెప్పుకోవచ్చు.
Hyderabad News: మల్కాజ్ గిరి ఎంపీ ఎన్నికల బరిలో ఒక టిఫిన్ చేసే యువకుడు నిలిచాడు. కొన్నేళ్ల క్రితం చిరిపిరెడ్డి రమేష్ అనే యువకుడు హైదరాబాద్ కు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే టార్గెట్ పెట్టుకుని వచ్చాడు. కానీ ఎంత కష్టపడి చదివిన కూడా సక్సెస్ కాలేకపోయాడు.
Mancheryala district: తమ జిల్లాలలో కొన్నిరోజులుగా చల్లని బీర్లు దొరకట్లేదని తాగుబోతులంతా ఆందోళన చెందుతున్నారంటూ ఒక యువకుడు ఏకంగా ఆబ్కారీ శాఖకు, ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Telangana News: సూర్యాపేట హైవే మీద తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు మీద ఆగి ఉన్న లారీని, కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జుగా మారిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
KCR Bus Yatra: లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. 'పొలంబాట'తో రైతుల పరామర్శకు వెళ్లగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇదే ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు గులాబీ దండు సిద్ధమైంది. కొన్ని రోజుల్లో ఈ యాత్రకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదల కానుంది.
KT Rama Rao Fire On Party Jumpings: పదేళ్లలో అధికారం, పదవులు పొంది ఇప్పుడు పార్టీని వీడుతున్న వారిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. మళ్లీ వస్తామని కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వారిని రానిచ్చేది లేదని గులాబీ పార్టీ స్పష్టం చేశారు.
KT Rama Rao Visited Rain Hit Farmers: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని.. ఢిల్లీకి చక్కర్లు కొట్టారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కరువు పరిస్థితుల్లో రైతులు ఇబ్బందుల్లో ఉంటే రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు.
Taslima Mahammad: సబ్ రిజిస్ట్రర్ తస్లీమా మహమ్మద్ పరిచయం అక్కర్లేని ప్రభుత్వఉద్యోగి. ఆమె ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో పొలంపనులకు వెళ్తు అందరిలో ఎంతో స్ఫూర్తిని నింపుతున్నట్లు బిల్డప్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆవిడగారు చేసిన ఘనకార్యం బైటపడటంతో సోషల్ మీడియాలోని జనాలు, ఆమె ఫాలోవర్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.