Tollywood IT Rides: గత కొన్నేళ్లుగా సినిమాల్లో కలెక్షన్స్ కు సంబంధించిన పోకడ ఎక్కువైంది. ఎవరు నిజం చెబుతున్నారు. ఎవరు అబద్ధం చెబుతున్నారనేది పై వాడికి ఎరక అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కోసారి హీరోలను సంతృప్తి పరచడానికి ఎక్కువ నంబర్స్ కలెక్షన్స్ తో పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని ఆదాయపు పన్ను అధికారులు ఒక్కసారి తెలుగులో అగ్ర నిర్మాతలైన దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు.