Central Govt Employees Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో జీతాల పెంపునకు సంబంధించి ప్రకటన ఉంటుందని భావించిన లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ తన ప్రసంగంలో ఎక్కడా కూడా కొత్త పే కమిషన్ గురించి ప్రస్తావించలేదు. దీంతో ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నాయి. భారీ ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నాయి.
PF New Rules For Employee: 2026 కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక మార్పులను ప్రతిపాదించారు. ముఖ్యంగా పీఎఫ్ అర్హతకు ఉండాల్సిన కనీస వేతన పరిమితిని పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి.
EPF Changes In Budget 2026: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. బడ్జెట్ 2026 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎఫ్ ట్రస్టులు, విత్‌డ్రా సదుపాయాలపై కీలక ప్రకటనలు చేశారు. ఈ మార్పులు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల ఉద్యోగులకు, కంపెనీలకు కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
India AI mission Budget: పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026 ప్రకటన నేపథ్యంలో క్రిప్టో, బ్లాక్‌చెయిన్ రంగం సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా సాంకేతికతకు పెద్దపీట వేయడం పట్ల పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
8th Pay Commission Update in Union Budget 2026
యూనియన్ బడ్జెట్ 2026ను ఫిబ్రవరి 1, 2026న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్లలో పెద్ద ఆసక్తి కనిపించింది. ముఖ్యంగా 8వ వేతన సంఘంపై ఏమైనా ప్రకటనలు వస్తాయా అని అందరూ ఎదురుచూశారు. కానీ ఈ బడ్జెట్‌లో వేతనాల పెంపు గురించి నేరుగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
Budget 2026 Update:
బడ్జెట్ 2026లో టెక్నాలజీ రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాలపై కీలక ప్రకటనలు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. డిజిటల్ టెక్నాలజీనే దేశ భవిష్యత్తు అభివృద్ధికి ప్రధాన శక్తిగా పేర్కొన్నారు.
Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో సామాన్య ప్రజలు, చిన్న పన్ను చెల్లింపుదారులు, విద్యార్థులు, పెట్టుబడిదారులు అందరికీ సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చౌకగా మారగా..ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ మాత్రం ఖరీదైంది.
Andhra Telangana Allocation In Budget: 2026-27 కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులు మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు దక్కినప్పటికీ, అమరావతి నిధులు, మెట్రో విస్తరణ వంటి కీలక ఆకాంక్షలు నెరవేరకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు పర్యాటక, రవాణా రంగాల్లో ప్రాధాన్యత లభించింది.
Nirmala Sitharaman on budget updates 2026: నిర్మల సీతారామన్ బడ్జెట్ లో మద్యం, పొగాకు ఉత్పత్తులతో సహా రోజువారీ వస్తువులను ప్రభావితం చేసే మార్పులను ప్రకటించారు. దీంతో లిక్కర్ రెట్లతో పాటు, ఆల్కాహల్ రేట్లు ధరల్లో నేరుగా కన్పించకున్న ఇన్ డైరెక్ట్ గా వీటికి విధించే ట్యాక్స్ లలో భారీ మార్పులు రానున్నాయి.
Union Budget 2026 Tax Changes: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పన్ను చెల్లింపుదారులకు తీపి కబురు అందించారు. ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్న నూతన ఆదాయపు పన్ను నిబంధనలు, పన్ను విధానంలో కీలక మార్పులను ప్రభుత్వం ప్రకటించింది.
Nirmala Sitharaman budget 2026 highlights: వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి, మహిళల తోడ్పాటు పెద్ద పీట వేయడానికి ఈ బడ్జెట్ లో మోదీ ప్రభుత్వం పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మొత్తంగా ఈ బడ్జెట్ మాత్రం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేదిగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
Union Budget 2026: మదేశమంతా ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో యూనియన్ బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇది ఆమె తొమ్మిదవ బడ్జెట్ కావడం విశేషం. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆటోమొబైల్ రంగం, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగం బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది.
Union Budget 2026: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రికార్డు స్థాయిలో నిర్మలమ్మ 9వ సారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా ఎలాంటి ప్రకటనలు ఉంటాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Union Budget 2026 Key Things: రేపు (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. దేశ ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా ఈ బడ్జెట్‌లో ఎలాంటి కీలక ప్రకటనలు ఉండబోతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Railway Ticket Discount For Senior Citizens: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026-27 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు (వృద్ధులకు) రైల్వే ప్రయాణాల్లో ఊరటనిచ్చేలా కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
Budget 2026: వార్షిక బడ్జెట్ 2026కు కౌంట్ డౌన్ మొదలైంది. 2026-27 కేంద్ర బడ్జెట్ సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సాంప్రదాయ హల్వా వేడుక నేడు, జనవరి 27న ఆర్థిక మంత్రిత్వ శాఖలో జరిగింది. బడ్జెట్ తయారీలో పాల్గొన్న సీనియర్ అధికారులు, సిబ్బందితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Parliament Budget Session 2026: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆర్ధిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ఆదివారం అయినా.. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
Big Good News To Govt Employees Likely To Increase 63 Percent Dearness Allowance: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌కు ముందే భారీ కానుక అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బడ్జెట్‌కు ముందు కరవు భత్యం 63 శాతం పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కోటి మంది ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించనుంది.
Union Budget 2026: ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ 2026–27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పన్ను చెల్లింపుదారుల్లో అంచనాలు ఉన్నా.. పాత పన్ను విధానంలో పెద్ద మార్పుల అవకాశాలు తక్కువ. ప్రభుత్వం కొత్త పన్ను వ్యవస్థ, స్థిరత్వం, సరళీకరణపై దృష్టి పెట్టనుంది. ఈ బడ్జెట్ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే తుది దశ సన్నాహాల్లో ఉంది. మోదీ ప్రభుత్వ హయాంలో నిర్మలా సీతారామన్ సమర్పించనున్న తొమ్మిదవ బడ్జెట్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు, వ్యాపార వర్గాలు, మధ్యతరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన కీలక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Union Budget 2026: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కీలక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. సంప్రదాయ సాగు పద్ధతుల నుంచి ఆధునిక సాంకేతికత ఆధారిత స్మార్ట్ అగ్రికల్చర్ వైపు వ్యవసాయ రంగాన్ని మలిచే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించేందుకు సిద్ధమవుతోంది. తాజా అంచనాల ప్రకారం, ఈసారి వ్యవసాయ రంగానికి దాదాపు రూ.1.50 లక్షల కోట్ల వరకు కేటాయింపులు ఉండే అవకాశముంది. గత ఆర్థిక సంవత్సరం 2025–26లో ఈ కేటాయింపు రూ.1.37 లక్షల కోట్లుగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.