Woman Killed In Kavadiguda: సికింద్రాబాద్‌లోని కవాడిగూడలో ఒక భయానక సంఘటన జరిగింది. కవాడిగూడలో బిల్డింగ్ నాల్గవ అంతస్తులో నివసిస్తున్న ఒంటరి మహిళను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో కలిసి పరిశీలించారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.