Money Saving Tips For Women: ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న ఖర్చులు పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ నెలాఖరుకు ఆ ఖర్చులన్నీ కలిపితే.. అది పెద్ద మొత్తం అవుతుంది. ముఖ్యంగా పిల్లల చదువుల ఫీజులు, బస్ ఛార్జీలు, బుక్స్, స్కూల్ ఈవెంట్స్.. ఇలా వచ్చేసరికి చాలా మందికి భారం పెరుగుతుంది. అయితే ఇంట్లో కొన్ని అలవాట్లను మార్చుకున్నట్లయితే లక్షన్న వరకు పొదుపు చేసుకోవచ్చు. అంటే ఆ డబ్బుతో మీ పిల్లలు స్కూల్ ఫీజులే కాదు.. కోచింగ్, డ్రాయింగ్ క్లాస్, స్పోర్ట్స్ ఫీజులు కూడా కవర్ అవుతాయి.
Money Saving Tips: మహిళలు ఇంటి ఆర్థిక వ్యవస్థను క్రమపద్ధతిలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ప్రతి నెల బడ్జెట్‌ను ముందుగా ప్లాన్ చేసి, ఆహారం, బిల్లులు, పిల్లల ఖర్చులు, ఎమర్జెన్సీ ఫండ్ వంటి ప్రాధాన్య ఖర్చులకు సరైన కేటాయింపు చేస్తే 10,000 రూపాయలతో కూడా ఇంటి ఖర్చులను సులభంగా మేనేజ్ చేయవచ్చు. హోల్సేల్ కొనుగోళ్లు, వంటనూనె వినియోగం తగ్గించడం, సబ్సిడీల వినియోగం వంటి చర్యలు మరింత పొదుపు చేయడంలో సహాయపడతాయి. నెలకు 500–1,000 రూపాయలు మిగిలితే వాటిని రికరింగ్ డిపాజిట్‌లో జమ చేయడం ద్వారా ఐదేళ్లలో మంచి మొత్తాన్ని సేవ్ చేసుకోవచ్చు. సరైన బడ్జెట్, నియమితమైన పొదుపు భవిష్యత్తు ఆర్థిక భద్రతకు బలమైన ఆధారం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.