Yoga Benefits Women's Health: అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 సందర్భంగా కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, మహిళల ఆరోగ్యం కోసం కొన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటి బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్లతో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే యోగాను ఈరోజు నుంచే ప్రారంభిద్దాం.
International Women's Day 2026: ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మహిళల నాయకత్వం, సమాజానికి వారు అందించిన సేవలను గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజు. ఈ రోజు కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాదు. మహిళలు సమాజంలోని ప్రతి రంగంలో సాధించిన విజయాలను గౌరవించడమే కాకుండా, లింగ సమానత్వం, భద్రత, గౌరవం, సాధికారత కోసం కొనసాగుతున్న పోరాటాన్ని గుర్తు చేసే రోజు కూడా. భారతదేశ చరిత్రలో అనేక మంది మహిళలు తమ కృషి, పట్టుదల, ధైర్యంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. రాజకీయాలు, క్రీడలు, అంతరిక్షం, పర్వతారోహణ, న్యాయరంగం వంటి విభిన్న రంగాల్లో వారు సాధించిన
Happy Womens Day 2026 Wishes: ప్రతి ఏడు మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. మహిళలకు సమాజంలో సమానమైన గుర్తింపును అందించాలనే స్ఫూర్తితో దీనిని జరుపుకుంటారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన పండగ రోజున మీ ఇంట్లో ఉన్న సోదరీమణులకు, మహిళలందరికీ ఇలా శుభాకాంక్షలు తెలపండి..
Women's Day Special 7 Yoga Practices For Every Woman: మహిళలకు బాధ్యతలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రత్యేకంగా ఉద్యోగాలు చేసే మహిళలకు అయితే ఇంట్లో పనితోపాటు పిల్లల్ని చూసుకోవడం, ఆఫీస్ వర్క్ బాధ్యతలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఎప్పుడూ కుటుంబసభ్యుల ఆరోగ్యం కోసం తపించిపోయే ఆడవాళ్లు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిరోజు ఈ 7 యోగాసనాలు వేయాలి అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఒత్తిడి నుంచి బయటపడతారు.
International Women's Day 2026 Date And Theme: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD) ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన నిర్వహిస్తారు. ఈసారి ఆదివారం ఈ వేడుక జరగనుంది. ప్రధానంగా మహిళలు, బాలికల విజయాలకు గుర్తింపుగా ఈ వేడుక జరుపుకుంటారు. ప్రతి ఆఫీసు, విద్యాసంస్థలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే ప్రతి ఏడాది మార్చి 8నే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? ఈసారి ప్రత్యేక థీమ్ ఏంటి?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.