ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి ప్రముఖల వరకు అందరూ కరోనావైరస్ ( Coronavirus ) ప్రభావానికి గురవుతున్నారు. తాజాగా తనను కలిసిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనమ్ ఘెబ్రేయేసస్ ( Tedros Adhanom ) సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు.
కరోనా వ్యాక్సిన్ ముందుగా ఎవరికి..ఇప్పుడిదే ప్రశ్న అందరి మదిలో ఉంది. ఎవరికి వారు తమకే ముందుగా అందాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడీ వైఖరే ప్రమాదకరమంటోంది డబ్ల్యూహెచ్ వో. ఉపయోగించుకునే విధానాన్ని బట్టి వైరస్ కట్టడి ఉంటుందంటోంది.
కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. వైరస్ తీవ్రతపై అప్రమత్తంగా ఉండకపోతే సమీప భవిష్యత్ లో మరణమృదంగం మోగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
తనదైన శైలిలో ట్వీట్లు, రీ ట్వీట్లతో చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra ) మరో వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. అది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ టెడ్రోస్ అథనామ్ పై.
కరోనా వైరస్ సంక్రమణ ( Corona virus spread )...అంతకంతకూ మారుతున్న వైరస్ రూపం నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..అన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందంటున్నారు.
కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine race ) రేసులో ముందు వరుసలో ఉన్న రష్యా ఇప్పుడు మూడో దశ ప్రయోగాలకు సిద్ధమౌతోంది. వ్యాక్సిన్ పై సర్వత్రా నెలకొన్న అభ్యంతరాల నేపధ్యంలో రష్యా ( Russia ) ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కరోనావైరస్ ( Coronavirus) టీకా కనుక్కున్నామని ప్రకటించి ప్రపంచానికి షాకిచ్చిన రష్యాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO ) షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 ( Covid-19) వ్యాక్సిన్ తయారీలో అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న తొమ్మిది టీకాల్లో రష్యా కనుక్కున్న వ్యాక్సిన్ పేరు లేదని తెలిపింది.
స్కూల్స్ ( Schools ) తిరిగి ప్రారంభించడంపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల వాదనలు విన్పిస్తున్నాయి. ఒక్కొక్కరి వాదన ఒక్కోలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం ఎలా ఉన్నా సరే...అసలు తల్లిదండ్రులు ( parents opinion ) ఏమనుకుంటున్నారనే విషయంపై ప్రముఖ సర్వే సంస్థ లోకల్ సర్కిల్స్ సర్వే ( Local circles survey )లో ఏం తేలింది. తల్లిదండ్రులు ఓకే అనేశారా ?
కరోనావైరస్ తో ( Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తోన్న చైనాలో మరో వైరస్ పుట్టుకొచ్చింది. చైనాలో కొత్త వైరస్ ( China New Virus ) గురించి ఇప్పటికే WHO హెచ్చరికలు కూడా జారీ చేసింది.
కరోనావైరస్ పై ( Coronavirus ) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) తాజా వ్యాఖ్యాలు కలవరపెట్టేలా ఉన్నాయి. కోవిడ్- 19 ( Covid-19 ) వైరస్ ఇప్పటిలో మనషులను వదిలిపెట్టేలా లేదు అని WHO అధ్యక్షుడు టెడ్రోస్ అధనాం గెబ్రయేసస్ ( Tedros Adhanom Ghebreyese ) తెలిపారు
అంతా కోవిడ్ ప్రపంచమే. కోవిడ్19 వైరస్ ( Covid19 virus ) మహమ్మారి సంక్రమణతో ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ ప్రారంభమై 7 నెలలు కావస్తున్నా ఇంకా ఉధృతి ఆగడం లేదు. ఒక్కరోజులో రెండున్నర లక్షల వరకూ కేసులు నమోదు కావడం భయం గొలుపుతోంది.
కరోనావైరస్ ( coronavirus) మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంకా నియంత్రణలోకి రాలేదని.. ఇది మరింత ఉగ్రరూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా COVID-19 కేసుల సంఖ్య గత ఆరు వారాల్లోనే రెట్టింపు అయ్యిందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తంచేసింది.
కరోనా వైరస్ ( Corona virus ) చికిత్సలో భాగంగా వివిధ రకాల మందులు అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందిన ఆ మందు కరోనా మరణాల్ని తగ్గిస్తుందనే విషయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆ మందుపై పేటెంట్ కలిగిన గిలియడ్ సైన్సెస్ (Gilead sciences ) ఈ తాజా విషయాన్ని వెల్లడించింది.
కోవిడ్ 19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోంది. అన్ని దేశాల్లోనూ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతోపాటు చాలా దేశాల్లో వివిధ రకాల మందుల్ని ఈ వైరస్ పై ప్రయోగిస్తూ పరిశోధనలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల ఫలితాలు ఎలా ఉన్నాయనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. మరో రెండు వారాల్లోనే ఔషధాల ప్రయోగ ఫలితాలు రానున్నట్టు డబ్యూహెచ్ వో స్పష్టం చేయడమే దీనికి కారణం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.