పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న అఖిలపక్ష సమావేశానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. జేడీయు తరపున బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత ఫరూక్ అబ్దూల్లా, శిరోమణి అకాలి దళ్ తరపున సుఖ్బీర్ సింగ్ బాదల్, బిజూ జనతా దళ్ తరపున ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పీడీపీ తరపున మెహబూబా ముఫ్తి, తదితర నేతలు హాజరయ్యారు. దేశంలో లోక్ సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే అంశంతోపాటు పలు ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ఈ అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల అధినేతలు డుమ్మా కొట్టారు.
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అమ్మకాల విషయంలో నూతన పాలసీ అమల్లోకి వచ్చేవరకూ ఉచిత ఇసుక సరఫరా బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కోడికత్తితో దాడి చేసిన యువకుడిని ఆదివారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.