)
Honda Activa 7G Price: హోండా యాక్టివా స్కూటర్‌కు భారత్‌లో ఎంత ప్రజాదరణ ఉందో అందరికీ తెలిసిందే.. దీని కారణంగానే హోండా కంపెనీ ఎప్పటికప్పుడు యాక్టివా(Activa)లోనే విభిన్న మోడల్స్‌ను విడుదల చేరుతూ వస్తోంది. గతంలో హోండా యాక్టివా 6g అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి సక్సెసర్‌గా హోండా కంపెనీ యాక్టివా 7జి (Honda Activa 7G) మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్లతో ప్రీమియం లుక్కుతో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇది అద్భుతమైన మైలేజీతో విడుదల కాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన అన్ని రకాల వివరాలు, ముఖ్యంగా లీక్ అయిన ఫీచర్లు ఇప్పుడు తెలుసుకుందాం.
స్కూటీ ప్రియులకు పెద్ద గుడ్ న్యూస్ గా భావించవచ్చు. హోండా యాక్టివా 7g (Honda Activa 7G) త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. నివేదికల ప్రకారం దీనిని కంపెనీ 2026 సంవత్సరం జనవరిలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనకు ముందే కొన్ని రకాల ఫీచర్స్‌తో పాటు ధర వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీని ధర రూ. 80 వేల నుంచి రూ.90 వేల వరకు కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హోండా యాక్టివా 6g (Honda Activa 6G) కంటే ఎన్నో రకాల అద్భుతమైన కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
భారత మార్కెట్లోకి హోండా యాక్టివా 7జీ (Honda Activa 7G) అందుబాటులోకి వస్తే.. ఇది మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న TVS Jupiter 125, Suzuki Avenis 125 స్కూటర్స్‌తో పోటీపడే అవకాశాలున్నాయి. ఇక హోండా కంపెనీ 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే తమ కొత్త స్కూటీ హోండా PCX 125ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి రెండు స్కూటర్లు విడుదలయితే.. వీటికి మధ్య పోటీ ఉండే అవకాశాలున్నట్లు మార్కెట్లోని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు.
ఇక యాక్టివా 7g (Honda Activa 7G) డిజైన్ వివరాల్లోకి వెళితే.. ఇది చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డిజైన్ పరంగా గతంలో మార్కెట్లోకి వచ్చిన 6g లాగా కాకుండా అప్డేటెడ్ డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇది ప్రత్యేకమైన ట్రాఫిక్ తో పాటు కొత్త కలర్ థీమ్‌లతో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్కూటర్ చాలా ప్రత్యేకమైన 109cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో విడుదల అవుతుంది. అంతేకాకుండా ఇది లీటర్ పెట్రోల్ కి దాదాపు 50 నుంచి 60 వరకు కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇక ఇందులో కంపనీ డిజిటల్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook