Samsung Galaxy M56 5G: సాంసంగ్ నుంచి మరో అదిరిపోయే మొబైల్.. దిమ్మతిరిగే ఫీచర్స్‌తో పాటు డిజైన్..

Samsung Galaxy M56 5G Launch Date: అతి త్వరలోనే సాంసంగ్ నుంచి అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. ఇది Samsung Galaxy M56 5G పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే కంపెనీ అధికారికంగా విడుదల చేయబోతోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 13, 2025, 10:59 AM IST
Samsung Galaxy M56 5G: సాంసంగ్ నుంచి మరో అదిరిపోయే మొబైల్.. దిమ్మతిరిగే ఫీచర్స్‌తో పాటు డిజైన్..

Samsung Galaxy M56 5G Launch Date: మార్కెట్లో అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీల కంటే సాంసంగ్‌కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అంతేకాకుండా అదే రేంజ్ లో ప్రజాధరణ కూడా ఉంది. ఈ కంపెనీ ఎప్పుడు మార్కెట్లోకి కొత్త మొబైల్స్ ను విడుదల చేసిన అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు ప్రీమియం బిల్డింగ్ క్వాలిటీతో అందుబాటులోకి వస్తాయి. అందుకే ఎక్కువగా ఇండియన్స్ ఈ మొబైల్స్ ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు.  అయితే సాంసంగ్ కంపెనీ కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్లోకి అతి తక్కువ ధరల్లోనే అద్భుతమైన ఫీచర్స్‌తో కూడిన మొబైల్స్ ను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతూ వస్తోంది. ప్రతి ఏడాది దాదా నాలుగు నుంచి ఐదు ప్రీమియం మొబైల్స్ లాంచ్ చేస్తే.. ఐదు నుంచి ఏడు బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ ను విడుదల చేస్తూ వస్తోంది. అయితే ఈ కంపెనీ అతి త్వరలోనే మరో స్మార్ట్ ఫోన్ను విడుదలకు సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

సాంసంగ్ కంపెనీ తమ కొత్త స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M56 5Gను త్వరలోనే భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక లాంచింగ్ తేదీని కూడా కంపెనీ ప్రకటించింది. ముందుగా ఈ మొబైల్ ను ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో అందుబాటులో ఉంచబోతోంది. మీ మొబైల్ అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో పాటు లగ్జరీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ ఏప్రిల్ 17వ తేదీన భారత్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ప్రత్యేకమైన ఆఫర్స్ లో భాగంగా అమెజాన్‌లో అందుబాటులో ఉంచి.. ఆ తర్వాత ఇతర ఈ కామర్స్ కంపెనీల వెబ్సైట్లో విక్రయాలకు అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది. ఈ మొబైల్ ను కంపెనీ Galaxy M55 స్మార్ట్ ఫోన్‌కి సక్సెసర్ విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ ను ప్రత్యేకమైన కెమెరాతో పాటు కొన్ని అద్భుతమైన ఏఐ ఫీచర్స్ ఉండబోతున్నాయి.

ఈ Samsung Galaxy M56 5G స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే... ఈ స్మార్ట్ ఫోన్ అల్ట్రా స్లిమ్ వేరియంట్‌లో రాబోతోంది. అంటే దీని మందం 7.2mm మాత్రమే ఉండబోతోంది. గతంలో విడుదల చేసిన సాంసంగ్ గాలక్సీ m55 సిరీస్ కంటే 30% సన్నగా ఉంటుంది. అలాగే దీనిబరుపు అన్ని మొబైల్స్ లా కాకుండా కేవలం 150 గ్రాములు మాత్రమే ఉండబోతున్నట్లు తెలిపింది. ఇందులో కంపెనీ డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం ప్రత్యేకమైన గొరిల్లా గ్లాస్ విక్టరీ ప్రొటెక్షన్ ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా అద్భుతమైన AMOLED+ డిస్ప్లే ప్యానెల్ కలిగి ఉంటుంది. ఇది గతంలో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్ కంటే 33% వరకు ప్రకాశవంతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

Galaxy M56 5G ఫీచర్స్ చూస్తే..
Galaxy M56 5G స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ప్రీమియం కెమెరాను కలిగి ఉంటుంది. దీని బ్యాక్ సైడ్‌లో త్రిబుల్ కెమెరా సెట్ అప్ అందుబాటులోకి రాబోతోంది. ఇందులోని ప్రధాన కెమెరా 50 ఎంపీ, ఉంటే అదనంగా 8 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 ఎంపి మైక్రో కెమెరా కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు వీడియో కాల్ మాట్లాడుకునేందుకు ప్రత్యేకమైన 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండబోతోంది. ఇందులోని కెమెరా సెట్ అప్ కి AI- పవర్డ్ ఎడిటింగ్ ఫీచర్ కూడా లభిస్తోంది. అలాగే వీడియో రికార్డింగ్ చేసుకునే వారికి ప్రత్యేకంగా నాయిస్ డిడక్షన్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల రద్దీ కలిగిన ప్రదేశాల్లో కూడా స్పష్టమైన మాటలతో వీడియోలను రికార్డు చేసుకోవచ్చు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News