)
Monitors Under 5000 Rupees: ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎలాంటి సేల్ లేకపోయినా.. మొబైల్స్, స్మార్ట్ టీవీలు వంటి ఇతర గాడ్జెట్స్‌పై భారీ తగ్గింపు కల్పించారు. ఈ క్రమంలో కేవలం రూ. 2000లకే ఎల్ఈడీ మానిటర్ కొనేందుకు అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్ఛరింగ్ సంస్థ అయిన జెబ్రానిక్స్ (ZEBRONICS).. తమ కంపెనీకి చెందిన ఓ ఎల్ఈడీ మానిటర్ ను అతితక్కువ ధరకే విక్రయించేందుకు సిద్ధమైంది. కేవలం రూ. 2,699 ధరకే దీన్ని యూజర్లుకు అందించేందుకు అమెజాన్ వెబ్సైట్..అతితక్కువ ధరను ఉంచింది.
జెబ్రానిక్స్ ఎల్ఈడీ మానిటర్ (18.5 అంగుళాల) ను మార్కెట్లో రూ.6,999 ధరకు అమ్మకానికి ఉంచారు. కానీ, అమెజాన్ వెబ్ సైట్లో దీనిపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ మానిటర్ పై ఇప్పుడు అమెజాన్ లో 61 శాతం తగ్గింపుతో కేవలం రూ. 2,699 ధరకే ఈ మానిటర్ ను విక్రయిస్తున్నారు. ఇంతే కాకుండా ఇతర బ్యాంకు, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వినియోగించుకొని.. దీనిపై మరో 500 నుంచి 600 రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ ఎల్ఈడీ మానిటర్ ను కేవలం రూ. 2000లకే దక్కించుకునేందుకు అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం దీని కొనేందుకు ఇప్పుడే అమెజాన్ వెబ్ సైట్లో లాగిన్ అవ్వండి.
Zebronics LED మానిటర్ స్పెసిఫికేషన్స్..
1) 46.9cm స్క్రీన్ సైజ్ (18.5inch LED డిస్ప్లే)
2) HDMI & VGA ఇన్పుట్ పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి.
3) టైమ్ రెస్పాన్స్: 8 మైక్రో సెకన్స్
4) HD 1366 x 768 రిజల్యూషన్ 16:9 Aspect Ratio
5) 16.7 లక్షల కలర్స్‌ను సపోర్ట్ చేస్తుంది.
6) డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో 500000:1
7) వాల్ మౌంట్, గ్లాసీ ప్యానల్, స్లిమ్ డిజైన్‌తో పాటు ఒక ఏడాది వారెంటీతో అందుబాటులోకి వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook