Good News From Central Railway Department: ప్రస్తుతం రైలు ప్రయాణం చేసే చాలామంది వారి విలువైన స్మార్ట్ ఫోన్స్ ఇతర వస్తువులను ఎక్కువగా పోగొట్టుకుంటున్నారు దీనిని తిరిగి పొందడానికి నానా తండాలు పడుతున్నారు అయినప్పటికీ కొంతమంది తిరిగి పొందలేకపోతున్నారు. ఇకనుంచి రైల్లో మొబైల్ పోగొట్టుకున్న వారు సులభంగా తిరిగి పొందవచ్చు దీనికోసం భారత రైల్వే శాఖ కొత్త పథకాన్ని ప్రకటించింది. దీనికోసం రైల్వే భద్రతా దళం టెలి కమ్యూనికేషన్ శాఖ భాగస్వామ్యంతో ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకురాబోతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
రైలు ప్రయాణం చేస్తున్న వ్యక్తులు ఎవరైనా అందులో మొబైల్ పోగొట్టుకున్న నిమిషాల వ్యవధిలోనే రైల్‌మాదద్ యాప్‌లో ప్రత్యేకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా నేరుగా 139కి కాల్ చేసి కూడా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇలా ఫిర్యాదు చేసిన వెంటనే CEIR పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయడం చాలా మంచిది. ఇలా చేసిన వెంటనే మీ మొబైల్ కు సంబంధించిన IMEI నంబర్‌ను బ్లాక్ అయిపోతుంది. దీని ద్వారా ఇకనుంచి ఎవరు మొబైల్ వినియోగించిన అధికారులకు సమాచారం అందుతుంది. దీనివల్ల మొబైల్ కూడా పూర్తిగా బ్లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పోయిన ఫోన్ ఎలా తిరిగి వస్తుంది?
రైల్లో పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్ను ఎంతో సులభంగా తిరిగి పొందవచ్చు. దీనికోసం మనం పోగొట్టుకున్న మొబైల్ ను ఎవరైనా సిమ్ కార్డు తీయకుండా వినియోగించినట్లయితే సమీప రైల్వే సెక్యూరిటీ ఆఫీసర్ కు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారి ఫోన్ లిఫ్ట్ చేస్తే సెక్యూరిటీ అధికారికి అప్పగించాలని కోరాలి. అప్పగించని వారు ఏవైనా డబ్బులు డిమాండ్ చేస్తే తప్పకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే వారు జిల్లా పోలీసు యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తారు. వారి వెంటనే ఫోన్ తీసుకున్న వారిని గుర్తించి వారి నుంచి దానిని సేకరిస్తారు ఆ తర్వాత యజమానికి అప్పగిస్తారు. ఈ సమయంలో తప్పకుండా మొబైల్ ఫోన్ కు సంబంధించిన అధికారిక బిల్ తప్పకుండా ఉండాల్సి ఉంటుంది.
రైల్లో పోగొట్టుకున్న మొబైల్ ను తిరిగి పొందడానికి CEIR పోర్టల్ ను కూడా వినియోగించవచ్చు. దీనికోసం ముందుగానే మీరు ఈ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ పోయిన వెంటనే ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా పోయిన మొబైల్ కు ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. అంతేకాకుండా దొరికిన వారు ఈ మొబైల్ వినియోగించకుండా ప్రత్యేకంగా బ్లాక్ చేసే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఇప్పటికే గత మే నెలలో ఈస్టర్న్ రైల్వే (NFR)లో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కాగా.. పోయిన చాలా మొబైల్స్ ను గుర్తించి వాటిని యజమానులకు అప్పగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని దొంగలించిన మొబైల్స్ ను కూడా పట్టుకొని తిరిగి రికవరీ చేసినట్లు భారత రైల్వే రక్షణ దళం తెలిపింది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









