)
ChatGPT Down Today: ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ChatGPT పనితీరులో గణనీయమైన అంతరాయం ఏర్పడింది. దీని వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ప్రసిద్ధ AI చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారని అనేక నివేదికలు వెల్లడించాయి. ఈ అంతరాయం చాలా చోట్ల ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌లో కూడా ఈ అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ఇప్పటికే భారతీయ వినియోగదారుల నుండి మాత్రమే 500 కి పైగా ఫిర్యాదులను నమోదు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
క్రమంగా ఫిర్యాదులో పెరిగిపోవడంతో సేవల అంతరాయం భారీగా పెరుగుతున్నట్లు సూచిస్తుంది. ఇదే విషయాన్ని చాలా మంది తమ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కొందరైతే లాగిన్ సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. మరికొందరు చాట్ బాట్ స్పందించడం లేదని ఎర్రర్ (Error) మెసేజ్ సూచిస్తుందని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ఈ చాట్‌బాట్ తిరిగి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంతరాయం స్వల్పకాలంగా ఉన్నట్లు సమాచారం. వీటిలో అనేక మీమ్స్, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వీటిలో చాలా ఫన్నీ మీమ్స్ కూడా ఉన్నాయి. చాట్ జీపీటీ పనిచేయడం లేదనే విషయంపై సోషల్ మీడియా వేదిక Xలో అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు.
అయితే ChatGPT పనితీరులో అంతరాయం కలగడం ఇది మొదటిసారి కాదు. జులై రెండో వారంలోనూ ఇదే విధమైన అంతరాయం కలిగింది. అంతే కాకుండా సాధారణ వినియోగదారులకే కాకుండా.. రోజువారీ పనిభారాన్ని తగ్గించుకునేందుకు దీనిపై ఆధారపడిన ఎంతో మందిని ఇది నిరాశకు గురిచేసింది. అయితే కొందరు వారి నైపుణ్యాలపై ఆధారపడి పనిచేసే వారికి చాట్ జీపీటీ అంతరాయం పెద్దగా నష్టం కలిగించకపోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook